వైఎస్ఆర్ మృతిపై బొత్స కన్నీరు పెట్టారు కానీ జగన్ పాత్రను ఖండించ లేదు: సోమిరెడ్డి
ABN , Publish Date - Apr 10 , 2026 | 04:52 PM
ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వీకెండ్ కథనంపై వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ నేతల తీరును ఈ సందర్భంగా ఆయన ఎండగట్టారు.
నెల్లూరు, ఏప్రిల్10: ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వీకెండ్ కథనంపై వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం నెల్లూరులో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలు కాకాణి గోవర్ధన్ రెడ్డి, అంబటి రాంబాబు, పేర్ని నాని తదితరులు వాడిన భాష కంటే ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ వాడిన భాష పెద్దదేమి కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైసీపీ నేతలు ఉత్తర కొరియా అనుకుంటున్నట్లు ఉన్నారని వ్యంగ్యంగా అన్నారు. మగాళ్లు అయితే రండి అంటూ సవాల్ విసిరిన మాజీ మంత్రి కాకాణి.. చింతామణిలో ఎందుకు దాకున్నట్లు అంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు. రామోజీ రావు, రాధాకృష్ణ మీద కేసులు పెడతామని బెదిరిస్తున్నారని వైసీపీ నేతలపై మండిపడ్డారు.
టీడీపీ వాళ్లకి క్రమశిక్షణ ఉందన్నారు. వైసీపీ నేతల లాగా తమకు మాట్లాడడం రాదని చెప్పారు. హైకోర్టు తీర్పు వైసీపీకి చెంపపెట్టు అని ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో రూ.3,500 కోట్లు మద్యం మాఫియా వల్ల 50 వేల మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతి చెందిన ఘటనలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కన్నీరు పెట్టుకున్నారు.. కానీ వైఎస్ జగన్ పాత్రను ఖండించలేదని ఈ సందర్భంగా సోమిరెడ్డి వివరించారు.
రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు పాలనలో వస్తున్న పెట్టుబడులు చూసి వైసీపీ నేతలు తలదించుకోవాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాలకు ఈ రోజు అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. కాకాణిలా పారిపోయే వారు టీడీపీలో లేరని సోమిరెడ్డి స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వస్తే ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఊపిరి ఉండదన్నందుకు అటెంప్ట్ మర్డర్.. వైసీపీ వారికి వర్తిస్తుందని స్పష్టం చేశారు.
కాకాణి బహిరంగంగా పత్రికాధిపతులను బెదిరిస్తుంటే పోలీసులు ఎందుకు ఆలోచిస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. కాకాణిపై కేసు నమోదు చేయాలనీ ఈ సందర్భంగా పోలీసులను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి డిమాండ్ చేశారు. గతంలో అధికారంలోకి వస్తే మొదటి సంతకాలు ప్రజా సంక్షేమం మీద ఉండేదని.. రేపు జగన్ అధికారంలోకి వస్తే ఆంధ్రజ్యోతి రద్దు మొదటి సంతకం అంటున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యంగ్యంగా అన్నారు.
ఇవి కూడా చదవండి..
‘కొత్త పలుకు’పై వైసీపీ వ్యాఖ్యలు.. కేబినెట్‌లో చర్చ.. సీఎం ఫైర్
వైసీపీ నేతలది గుంట నక్కల రాజకీయం: కేంద్ర మంత్రి రామ్మోహన్
Read Latest AP News And Telugu News