Share News

టీడీపీ నేత హత్య కేసులో వైసీపీ నేత లొంగుబాటు

ABN , Publish Date - Sep 10 , 2026 | 05:20 PM

నెల్లూరు జిల్లాలో ఓ టీడీపీ నేత హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ నాయకుడు నాయుడుపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో లొంగిపోయారు. ఈ మేరకు 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం.

టీడీపీ నేత హత్య కేసులో వైసీపీ నేత లొంగుబాటు
YSRCP Leader Kamireddy Satyanarayana Reddy Surrenders

నెల్లూరు, సెప్టెంబర్ 10: టీడీపీ నేత బాలయ్య హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ నాయకుడు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి నాయుడుపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో లొంగిపోయారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం.. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయన్ను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.


కాగా.. పెళ్లకూరు మండలం చిల్లకూరు ప్రాంతంలో ప్రభుత్వ భూములు, కాలువలను సత్యనారాయణ రెడ్డి ఆక్రమించారంటూ పలువురు టీడీపీ నేతలు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి.. కాలువ, పోరంబోకు భూమి ఆక్రమణకు గురైనట్లు తేల్చారు. అదే ప్రాంతంలో తన పొలానికి రోడ్డు వేసేందుకు యత్నించగా టీడీపీ నేతలు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో వారిపై రౌడీలు, వైసీపీ కార్యకర్తలతో సత్యనారాయణ రెడ్డి దాడికి దిగినట్టు తెలుస్తోంది.


ఈ దాడిలో టీడీపీ నేత బాలయ్య ఛాతీపై పిడిగుద్దులతో విరుచుకుపడటంతో ఆయన తీవ్రంగా గాయపడి మృతిచెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సత్యనారాయణ రెడ్డిని ప్రధాన నిందితుడిగా చేర్చారు. దీంతో న్యాయస్థానంలో లొంగిపోయిన సత్యనారాయణ రెడ్డికి కోర్టు రెండు వారాల పాటు రిమాండ్ విధించింది.


ఇవీ చదవండి:

తిరుపతి–విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసు ప్రారంభం

మంత్రి పదవి పోయాక.. మతి భ్రమించిందా?: ప్రశాంతి రెడ్డి

Updated Date - Sep 10 , 2026 | 05:21 PM