తిరుపతి–విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసు ప్రారంభం
ABN , Publish Date - Sep 10 , 2026 | 01:31 PM
విజయవాడ–తిరుపతి విమాన ప్రయాణికులకు మరో సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుపతికి ఫ్లై91 నూతన విమాన సర్వీసు ప్రారంభమైంది. విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఈ సర్వీసును ప్రారంభించారు. వారంలో నాలుగు రోజుల పాటు విమాన సేవలు కొనసాగనున్నాయి.
కృష్ణా, సెప్టెంబర్ 10: జిల్లాలో తిరుపతి–విజయవాడ మధ్య ఫ్లై91 నూతన విమాన సర్వీసు ప్రారంభమైంది. గన్నవరం విమానాశ్రయంలో విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు రిబ్బన్ కట్ చేసి ఈ సర్వీసును ప్రారంభించారు. తొలి ప్రయాణికులకు ఆయన స్వయంగా టికెట్లు అందజేశారు. వారంలో నాలుగు రోజుల పాటు తిరుపతి–విజయవాడ మధ్య ఈ విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయని యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. కొత్త విమాన సర్వీసు అందుబాటులోకి రావడం ద్వారా విజయవాడ, తిరుపతి మధ్య ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. ‘కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడికి కృతజ్ఞతలు. ఆదివారం కూడా తిరుపతి–విజయవాడ మధ్య విమాన సర్వీసు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. గన్నవరం విమానాశ్రయం నుంచి ఎమిరేట్స్, ఖతర్, లుఫ్తాన్సా వంటి అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉంది. గత 12 ఏళ్లలో గన్నవరం విమానాశ్రయం భారీగా అభివృద్ధి సాధించిందని, భవిష్యత్తులో మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
అంతర్జాతీయ అనిశ్చితులు.. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు
ఈసీఐ వెబ్‌సైట్‌లో ‘సర్’ నోటీసులు
Read Latest AP News And Telangana News