Share News

మంత్రి పదవి పోయాక.. మతి భ్రమించిందా? : ప్రశాంతి రెడ్డి

ABN , Publish Date - Sep 10 , 2026 | 12:40 PM

వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి దంపతులుపై వైసీపీ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఘాటుగా స్పందించారు. వేమిరెడ్డిని విమర్శించే ముందు తమ బతుకులేంటో తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు.

మంత్రి పదవి పోయాక.. మతి భ్రమించిందా? : ప్రశాంతి రెడ్డి

నెల్లూరు, సెప్టెంబర్ 10: వైసీపీ ఆధ్యర్యంలో కొవ్వూరులో జరిగిన స్థానిక సంస్థల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి, వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ వేమిరెడ్డిపై చేసిన వాఖ్యలపై కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఫైర్ అయ్యారు.


‘ఎన్నో సార్లు వేమిరెడ్డి దగ్గరకి వచ్చి సాయం చెయ్యమని పొర్లు దందాలు పెట్టిన సంగతి మరచిపోయవా..? మినిస్టర్ పదవి పోయాక మతి భ్రమించిందా..? మంత్రిగా ఉన్న రెండేళ్ల కాలంలో నువ్వు ఎన్నో దందాలు చేశావు. వాటన్నింటికీ మా దగ్గర సాక్ష్యాలున్నాయి. మైనింగ్‌లో ఎంత దోచుకున్నావో.. అన్నీ బయటపెడతాం’ అంటూ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.


అనిల్ యాదవ్ చేస్తున్న అసత్య ఆరోపణల వల్లే క్వార్జ్ వ్యాపారం నుంచి బయటికి వచ్చామని ప్రశాంతి రెడ్డి అన్నారు. 76 మంది క్వార్జ్ వ్యాపారుల దగ్గర నుంచి అనిల్ వందల కోట్లు దోచుకున్నాడని ప్రశాంతి ఆరోపించారు. అనిల్ అక్రమ వసూళ్లకి సంబంధించిన ఆధారాలని‌ మీడియాకి చూపించారు. రూప్ కుమార్ ని ఢీ కొట్టే దమ్ము లేక వేమిరెడ్డిపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.


‘ఎన్నికల సమయంలో మా దగ్గర డబ్బులు తీసుకుని మమ్మల్నే విమర్శిస్తున్నావా.. నెల్లూరులో తంతే.. నరసరావుపేట లో పడ్డావ్.. అక్కడి నుంచి చెన్నై వెళ్ళావ్.. జగన్ నీకు ఇంతవరకు అడ్రెస్ కూడా ఇవ్వలేదు.. నిన్ను నమ్ముకున్న ఖలీల్‌ని డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేయించావు. మీ వల్ల ఆత్మహత్యకు పాల్పడిన ఓ కాంట్రాక్టర్‌ను మేము కాపాడాము. విమర్శలు చేసే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోమ’ని ఎమ్మెల్యే హితవు పలికారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఈగోలు లేకుండా ప్రజల కోసం పనిచేద్దాం: కలెక్టర్లతో సీఎం చంద్రబాబు

జారిపోతున్నా పట్టువదల్లేదు.. కూల్‌డ్రింక్ బాటిల్ చేజిక్కించుకున్నాడు.. వీడియో వైరల్

For More AP News And Telugu News

Updated Date - Sep 10 , 2026 | 02:01 PM