Share News

మా ప్రభుత్వంలో విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాం: కోటంరెడ్డి

ABN , Publish Date - Aug 23 , 2026 | 10:44 AM

కూటమి అధికారంలోకి వచ్చాక విద్యా, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం నెల్లూరు జీజీహెచ్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

మా ప్రభుత్వంలో విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాం: కోటంరెడ్డి
MLA Kotamreddy Sridhar Reddy

నెల్లూరు, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): కూటమి అధికారంలోకి వచ్చాక విద్యా, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotamreddy Sridhar Reddy) వ్యాఖ్యానించారు. ఈరోజు (ఆదివారం) నెల్లూరు జీజీహెచ్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జెన్ జీ ఐఐటీ స్కాలర్‌ను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆయా సమస్యలపై ప్రజలు ‘నన్ను ప్రశ్నించవచ్చు’ అనే కార్యక్రమం శ్రీకారం చుట్టానని ప్రస్తావించారు.


నెల్లూరు జీజీహెచ్‌లో ఆయా సమస్యలపై వరంగల్ ఐఐటీలో పీహెచ్‌డీ స్కాలర్ శ్రీహరి తనకు మెసేజ్ చేశారని ఎమ్మెల్యే కోటంరెడ్డి తెలిపారు. జీజీహెచ్‌లో సౌకర్యాలపై దృష్టి పెట్టాలని కోరారన్నారు. ఈ విషయంపై తాను వెంటనే సమీక్షించానని అన్నారు. జీజీహెచ్‌లో మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించామని చెప్పారు. జీజీహెచ్‌లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి DSR రఘురాం రెడ్డి, ఇస్కాన్ రామకృష్ణా రెడ్డి దాతలు ముందుకు వచ్చారని వెల్లడించారు. రూ.కోటి వ్యయంతో అభివృద్ధి పనులకు జెన్ జీ శ్రీహరి శంకుస్థాపన చేశారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.


వార్తలు కూడా చదవండి...

ఉద్యోగాలు, ప్రతిభకు దేశంలోనే నంబర్‌వన్ సిటీగా విశాఖ: సీఎం చంద్రబాబు

పవన్ కల్యాణ్ దిశానిర్దేశం.. శరవేగంగా అడవుల పునరుద్ధరణ కార్యక్రమం

ఈ ఏడాది మరో 3వేల టీచర్ పోస్టుల భర్తీ: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 23 , 2026 | 10:59 AM