Share News

మెమో రైళ్ల రద్దుతో ఇబ్బందులు

ABN , Publish Date - Jul 29 , 2026 | 01:00 PM

నాయుడుపేట స్వర్ణముఖినది వంతెనపై మరమ్మతులతో పలు మెమో రైళ్లు రద్దు కాగా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు కొంత ఆలస్యంగా నడిచాయి.

మెమో రైళ్ల రద్దుతో ఇబ్బందులు

  • సూళ్లూరుపేట రైల్వే స్టేషన్‌లో నిలిపివేసిన మెమో రైలు

తడ(అమరావతి): నాయుడుపేట స్వర్ణముఖినది వంతెనపై మరమ్మతులతో పలు మెమో రైళ్లు రద్దు కాగా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు కొంత ఆలస్యంగా నడిచాయి. స్వర్ణముఖినది వంతెనలో ఉన్న ఇనుక గడ్డర్ల స్థానంలో సిమెంట్‌ గడ్డర్ల ఏర్పాటుకు రైల్వేశాఖ సిద్ధమైంది.10 రోజులుగా ఆ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. దీంతో రెండు రోజులుగా పలు మెమో రైళ్లను రద్దు చేశారు.


మంగళవారం సూళ్లూరుపేట నుంచి నెల్లూరుకు ఉదయం 8.05 గంటలకు, 10 గంటలకు వచ్చే మెమో రైళ్లు, అలాగే నెల్లూరు నుంచి సూళ్లూరుపేటకు ఉదయం 10.20, సాయంత్రం 4.00 గంటలకు వచ్చే మెమో రైళ్లు పూర్తిగా రద్దు చేశారు. ఈ రైళ్లు చెన్నై, సూళ్లూరుపేట మధ్య మాత్రమే నడిచేలా నిర్ణయించి ఆ రైళ్లను సూళ్లూరుపేటలో నిలిపివేశారు. అలాగే కొన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు కొంత ఆలస్యంగా నడిచాయి. గురువారం కూడా ఈ రైళ్లు రద్దు కానున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది.


xxx.jpgమెమో రైళ్ల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికే సూళ్లూరుపేట నుంచి నెల్లూరు వైపు వెళ్లే పలు బస్సులను కొంతకాలంగా నిలిపివేశారు. చెన్నై నుంచి వెళ్లే బస్సులు పూర్తిగా రద్దీగా నడుస్తుండటంతో ఆ బస్సులన్నీ సూళ్లూరుపేట బైపాస్‌ మీదుగానే ప్రయాణించాయి. దీంతో బస్సులు లేక అటు రైళ్ల రద్దుతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మెగా డీఎస్సీపై వైసీపీవి నిరాధార ఆరోపణలు: సానా సతీష్ బాబు

‘నేను కూడా మిమ్మల్ని కలవాలనుకుంటున్నా’..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 29 , 2026 | 01:00 PM