Share News

‘నేను కూడా మిమ్మల్ని కలవాలనుకుంటున్నా’.. ఆదోని చిన్నారుల వీడియోపై లోకేశ్

ABN , Publish Date - Jul 29 , 2026 | 11:27 AM

‘లోకేశ్ సర్.. మిమ్మల్ని కలవాలి’ అంటూ చిన్నారులు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆదోనికి చెందిన సహస్ర ఆద్య, జయ స్కంద అనే చిన్నారులు.. మంత్రితో ఫొటో దిగాలని ఉందని ఆకాంక్షిస్తూ చేసిన వీడియోపై లోకేశ్ తక్షణమే స్పందించారు.

‘నేను కూడా మిమ్మల్ని కలవాలనుకుంటున్నా’.. ఆదోని చిన్నారుల వీడియోపై లోకేశ్
Nara Lokesh viral video

కర్నూలు జిల్లా, జులై 29: ‘లోకేశ్ సర్.. మిమ్మల్ని కలవాలి’ అంటూ చిన్నారులు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఆదోనికి చెందిన సహస్ర ఆద్య, జయ స్కంద అనే చిన్నారులు.. మంత్రితో ఫొటో దిగాలని ఉందని ఆకాంక్షిస్తూ చేసిన వీడియోపై లోకేశ్ తక్షణమే స్పందించారు. చిన్నారులు చేసిన వీడియోను తన ‘ఎక్స్‌’ ఖాతాలో రీపోస్ట్ చేసిన మంత్రి.. ‘నేను కూడా మిమ్మల్ని కలవడానికి ఎదురుచూస్తున్నాను’ అంటూ ఆప్యాయమైన సందేశాన్ని పంపించారు.


తమ అభిమాన నాయకుడిని కలవాలని కోరుతూ చిన్నారులు చేసిన విజ్ఞప్తికి మంత్రి స్పందించడం పట్ల వారి కుటుంబ సభ్యులు, స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. చిన్నారుల పట్ల మంత్రి చూపిన ఆప్యాయతకు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.


చిన్నారులు వీడియోలో ఏం చెప్పారంటే..

‘లోకేశ్ సర్.. ఎప్పుడూ మా నాన్న, తాతే మీ దగ్గర ఫొటో దిగుతున్నారు. నేను దిగాలంటే మీరు ఎక్కడో ఉంటున్నారు. వీళ్లు మమ్మల్ని పంపరు. మీరు ఆదోనికి వస్తున్నారు కదా. నన్ను, మా తమ్ముడిని అక్కడి పిలుచుకుని రమ్మని మా నాన్నకు చెప్పండి. ప్లీజ్ సర్’ అంటూ మంత్రి లోకేశ్‌ను ఉద్దేశిస్తూ ఇద్దరు చిన్నారుల చెప్పిన మాటలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.


ఇవి కూడా చదవండి...

నాన్న కలను గెలిపించింది

తిరుపతిలో మహిళ దారుణ హత్య..

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 29 , 2026 | 12:04 PM