తిరుపతిలో మహిళ దారుణ హత్య..
ABN , Publish Date - Jul 29 , 2026 | 09:47 AM
తిరుపతిలో మహిళ హత్య తీవ్ర కలకలం రేపుతోంది. ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రూప్ థియేటర్ సమీపంలో ఉన్న పీజీఆర్ లాడ్జిలో మహిళ హత్యకు గురైంది.
తిరుపతి, జులై 29: నగరంలో మహిళ హత్య తీవ్ర కలకలం రేపుతోంది. ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రూప్ థియేటర్ సమీపంలో ఉన్న పీజీఆర్ లాడ్జిలో మహిళ హత్యకు గురైంది. లాడ్జిలో బెడ్‌పై విగత జీవిగా పడి ఉన్న మహిళను పోలీసులు గుర్తించారు. రాజస్థాన్ రాష్ట్రం పాళీ జిల్లాకు చెందిన ధనరాజ్ దంపతులు ప్లాస్టిక్ వస్తువులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈనెల 21న పీజీఆర్ లాడ్జికి వచ్చిన ఇరువురూ వృత్తిరీత్యా ఉదయం వెళ్లి సాయంత్రం రూమ్‌కు వచ్చి బస చేశారు.
27న సాయంత్రం దంపతులు లాడ్జికి చేరుకోగా.. 28న ఉదయం ధనరాజ్ ఒక్కడే బయటకు వెళ్లినట్లు లాడ్జి సిబ్బంది తెలిపారు. 28న రాత్రి అద్దె అడిగేందుకు లాడ్జి సిబ్బంది రూం వద్దకు వెళ్లగా దుర్వాసన రావడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని రూమ్‌లోకి వెళ్లి చూడగా 30 ఏళ్ల మహిళ బెడ్‌పై విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
ఇవి కూడా చదవండి...
స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telugu News