Share News

మెగా డీఎస్సీని రద్దు చేయండి!

ABN , Publish Date - Jul 29 , 2026 | 09:43 AM

‘మెగా డీఎస్సీ’పై వైసీపీ కసి కొనసాగుతూనే ఉంది. డీఎస్సీ-2025లో జరిగిన టీచర్ల నియామకాలన్నీ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో మరోసారి ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసింది.

మెగా డీఎస్సీని రద్దు చేయండి!

  • నియామకాల రద్దుకు ఆదేశాలివ్వండి

  • హైకోర్టులో వైసీపీ ఎమ్మెల్సీ మరో వ్యాజ్యం

అమరావతి: ‘మెగా డీఎస్సీ’పై వైసీపీ కసి కొనసాగుతూనే ఉంది. డీఎస్సీ-2025లో జరిగిన టీచర్ల నియామకాలన్నీ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో మరోసారి ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసింది. ‘‘టీచర్ల నియామక ప్రక్రియలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలి. నియామక ప్రక్రియకు సంబంధించిన రికార్డులతో పాటు జవాబు పత్రాలు, లాగిన్‌ ఐడీలను సీజ్‌ చేసి భద్రపరిచేలా ప్రభుత్వాన్ని ఆదేశించండి’’ అని వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి హైకోర్టును కోరారు.


నియామకాలను రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు. మెగా డీఎస్సీ పై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ చంద్రశేఖర్‌రెడ్డి ఇటీవల హైకోర్టులో గతంలో దాఖలు చేసిన పిల్‌ ఈనెల 20న ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా పిల్‌ దాఖలు చేసిన విధానాన్ని ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించింది.


చాలా క్యాజ్యువల్‌ విధానంలో పిల్‌ వేశారని, ఆరోపణలకు సంబంధించి కనీస డాక్యుమెంట్లను జత చేయలేదని వ్యాఖ్యానించింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది క్షమాపణ కోరడంతో ఽ పిల్‌ను కొట్టివేస్తూ.. ఉపసంహరణకు అనుమతి (డిస్‌మిసల్‌ యాజ్‌ విత్‌ డ్రాన్‌)ఇచ్చింది. తాజాగా పిల్‌ దాఖలు చేసుకొనేందుకు ధర్మాసనం స్వేచ్ఛనిచ్చింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి మరోసారి ‘పిల్‌’ దాఖలు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

బొండా ఉమా వివరణతో సంతృప్తి చెందిన అధిష్ఠానం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 29 , 2026 | 09:43 AM