అందుకే రాజకీయాల్లోకి వచ్చా.. మంత్రి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Sep 27 , 2026 | 07:55 PM
పురిటిగడ్డ రుణం తీర్చుకోవాలని తాను రాజకీయాల్లోకి వచ్చానని ఏపీ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తున్నానని పేర్కొన్నారు.
నెల్లూరు జిల్లా, సెప్టెంబర్ 27 (ఆంధ్రజ్యోతి): పురిటిగడ్డ రుణం తీర్చుకోవాలని తాను రాజకీయాల్లోకి వచ్చానని ఏపీ మంత్రి నారాయణ (Narayana) స్పష్టం చేశారు. నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తున్నానని పేర్కొన్నారు. ప్రభుత్వ నిధులతో పాటు తన సొంతనిధులను కూడా పేదల అభివృద్ధికి వెచ్చిస్తున్నానని వెల్లడించారు. వీఆర్సీ స్ఫూర్తితో జాకీర్ హుస్సేన్ నగర్ హైస్కూల్‌ను రూ.13కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించేందుకు అంటోని కనస్ట్రక్షన్స్ ముందుకువచ్చిందని తెలిపారు. తన కుమార్తె షరణితో కలిసి ఈరోజు (ఆదివారం) శంకుస్థాపన చేశానని మంత్రి పేర్కొన్నారు.
హైస్కూల్ పిల్లలకు 10 వేల సైకిళ్లు పంపిణీ చేశాం..
గొడ్డలి పార్టీ మూసేసిన వీఆర్సీని నాలుగు నెలల్లో ఆధునికీకరించామని నారాయణ వ్యాఖ్యానించారు. రూ. 8 కోట్ల సొంత నిధులతో ప్రభుత్వ హైస్కూల్ పిల్లలకు 10 వేల సైకిళ్లు పంపిణీ చేశామని వెల్లడించారు. భగత్ సింగ్ కాలనీ, సర్వేపల్లి కాలువ కట్ట వాసులకు 2615 శాశ్వత పట్టాలు మంజూరు చేశామని వివరించారు. నెల్లూరు సిటీలో 5 వేల కుటుంబాలకు పట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని మాటిచ్చారు. పేదలకు ఏ కష్టం వచ్చినా తన కుటుంబం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. భారత దేశ పటంలో నెల్లూరు నగరానికి ప్రత్యేక గుర్తింపు తెస్తానని మంత్రి నారాయణ ఉద్ఘాటించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అదానీ గ్రూప్ ఎనర్జీ మానిటరింగ్ సెంటర్‌ను సందర్శించిన మంత్రి లోకేశ్
స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యం: మంత్రి పార్థసారథి
కర్నూలు ఎయిర్‌పోర్టు వేదికగా ఏవియేషన్ శిక్షణ: మంత్రి జనార్దన్ రెడ్డి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News