కోటంరెడ్డి జెన్‌జీ యువతతో సమావేశాలు నిర్వహించడం అభినందనీయం: మంత్రి లోకేశ్
ABN , Publish Date - Aug 26 , 2026 | 12:42 PM
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జెన్ జీ యువతతో సమావేశాలు నిర్వహించడాన్ని, ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా ద్వారా అభినందించారు. కోటంరెడ్డి జెన్‌జీ యువతతో సమావేశాలు నిర్వహించడం అభినందనీయమని వ్యాఖ్యానించారు.
నెల్లూరు, ఆగస్టు26 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జెన్ జీ యువతతో సమావేశాలు నిర్వహించడాన్ని, ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) సోషల్ మీడియా ద్వారా అభినందించారు. కోటంరెడ్డి జెన్‌జీ యువతతో సమావేశాలు నిర్వహించడం అభినందనీయమని వ్యాఖ్యానించారు. యువత ఆశలు, లక్ష్యాలు, సమస్యలు, ఆలోచనలు తెలుసుకోవడం చాలా అవసరమని పేర్కొన్నారు. జెన్‌జీ వేదిక ఒక అద్భుతమైన చొరవ అని తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా లోకేశ్ పోస్టు పెట్టారు.
యువత ఆకాంక్షలు అర్ధం చేసుకోవడానికి, వారికి ప్రయోజనకరంగా కార్యక్రమాలు నిర్వహించడానికి నిరంతర సంప్రదింపులు జరపాలని లోకేశ్ సూచించారు. ఆసక్తికరమైన, లోతైన భావాల మార్పిడి కోసం తాను ఎదురు చూస్తున్నానని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
మంత్రి లోకేశ్ దార్శనికతతో జెన్ జీ సమావేశాలు: ఎమ్మెల్యే కోటంరెడ్డి
మంత్రి లోకేశ్ దార్శనికతతో ప్రేరణ పొంది, తర్వాతి తరం ఆలోచనలు, ఆకాంక్షలు, అంచనాలు తెలుసుకునేందుకు జెన్ జీ సమావేశాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పైలట్ల డోప్ టెస్టులపై కేంద్రం ఫోకస్.. ఏడాదికి ఒకసారి పరీక్షకు యోచన: రామ్మోహన్
బీసీలను జగన్ రెడ్డి మోసం చేస్తున్నారు.. యనమల ధ్వజం
వన మహోత్సవం లక్ష్యాలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలి: మంత్రి సీతక్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News