Share News

ఆ అమ్మవారి ఆశీస్సులతో రాజకీయాలు చేస్తున్నాం: మంత్రి ఆనం

ABN , Publish Date - Apr 25 , 2026 | 09:48 PM

ఏసీ సుబ్బారెడ్డి వారసులుగా తాము ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేత లక్ష్మీ నరసింహాస్వామి ఆశీస్సులతో రాజకీయాలు చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. తమ కుటుంబ సభ్యులు ఈ ఆలయ బాధ్యతలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.

ఆ అమ్మవారి ఆశీస్సులతో రాజకీయాలు చేస్తున్నాం: మంత్రి ఆనం
AP Minister Anam Rama narayana Reddy

నెల్లూరు జిల్లా, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): ఏసీ సుబ్బారెడ్డి వారసులుగా తాము ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేత లక్ష్మీ నరసింహాస్వామి ఆశీస్సులతో రాజకీయాలు చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (AP Minister Anam Rama narayana Reddy) వ్యాఖ్యానించారు. తమ కుటుంబ సభ్యులు ఈ ఆలయ బాధ్యతలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈరోజు (శనివారం) నెల్లూరు జిల్లాలోని చెంచులక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రఘురామకృష్ణరాజు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, బీద రవిచంద్ర యాదవ్ ప్రత్యేక పూజలు చేశారు. తాము ఏ కార్యక్రమం తలపెట్టిన అమ్మవారి ఆశీస్సులతోనే చేస్తామని తెలిపారు. స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి ఈ ఆలయ నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చారని ప్రస్తావించారు. తమ కుటుంబానికి అత్యంత ముఖ్యమైన దేవత చెంచులక్ష్మి అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.


ఏపీలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు అమ్మ అశీస్సులు ఉండాలి: రఘురామ

ఎన్నో దశాబ్దాలుగా చెంచులక్ష్మి అమ్మవారిని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు మొక్కుతున్నారని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. ఈ దేవతను దర్శించుకోవడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు. ఏపీలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు అమ్మ అశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని రఘురామ అన్నారు.


చెంచులక్ష్మిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది: బీద రవిచంద్ర

మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుటుంబ ఇంటి దైవం చెంచులక్ష్మి దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉందని తెలుగుదేశం పార్టీ నేత బీద రవిచంద్ర యాదవ్ తెలిపారు.


అమ్మవారి ఆశీస్సులు ప్రజలకు ఎల్లప్పుడు ఉండాలి: ప్రశాంతి రెడ్డి

చెంచులక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. అత్యంత విశిష్టత కలిగిన అమ్మవారి ఆశీస్సులు ప్రజలకు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నానని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏపీలో కిల్లర్ పార్టీ దారుణాలకు తెగబడుతోంది.. సీఎం వార్నింగ్

బీటెక్ విద్యార్థులను సైబర్ క్రైమ్‌లోకి ముఠాలు లాగుతున్నాయి: రాయపాటి శైలజ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Apr 25 , 2026 | 09:55 PM