Share News

Anam Ramanarayana Reddy: రైతుల భూములపై వైసీపీ కుట్ర.. మంత్రి ఆనం ధ్వజం..

ABN , Publish Date - Jan 18 , 2026 | 08:50 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో స్థానిక నేతలు, ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా రైతుల భూములను దోచుకోవాలని చూశారని ధ్వజమెత్తారు..

Anam Ramanarayana Reddy: రైతుల భూములపై వైసీపీ కుట్ర.. మంత్రి ఆనం ధ్వజం..
Anam Ramanarayana Reddy

నెల్లూరు, జనవరి18 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి (Anam Ramanarayana Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో స్థానిక నేతలు, ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా రైతుల భూములని దోచుకోవాలని చూశారని ధ్వజమెత్తారు. ఆదివారం నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు మండలం పొంగూరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలాగే పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రైతులకి ప్రభుత్వ రాజముద్రతో ఉన్న పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి ఆనం మీడియాతో మాట్లాడారు.


రైతుల భూములు కాపాడాం..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేసి రైతుల భూములని కాపాడిందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. వైసీపీ హయాంలో సర్వే రాళ్లపై జగన్ రెడ్డి బొమ్మలు వేసి.. రూ.675 కోట్లు దోచేశారని ఆరోపణలు చేశారు. ట్రూ అఫ్ చార్జీల పేరుతో రైతులు, ప్రజల వద్ద నుంచి రూ.32 వేల కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. సోమశిల హై లెవెల్ కెనాల్ పనులు పూర్తి చేసి.. మెట్ట ప్రాంత రైతులకి నీరు అందిస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మా ప్రభుత్వంపై ఫేక్ ప్రచారం చేస్తున్నారు.. జగన్ అండ్ కోపై సీఎం ఫైర్

అసెంబ్లీ సమావేశాలపై.. రఘురామ క్లారిటీ

For More TG News And Telugu News

Updated Date - Jan 18 , 2026 | 09:01 PM