Share News

జల సంక్షోభం.. తుంగభద్రలో ఉన్నవి 9.325 టీఎంసీలే..

ABN , Publish Date - Jul 02 , 2026 | 01:40 PM

దక్షిణ భారత రైతాంగానికి జీవనాడి అయిన తుంగభద్ర జలాశయం నీటి సంక్షోభం ఎదుర్కొంటోంది.

జల సంక్షోభం.. తుంగభద్రలో ఉన్నవి 9.325 టీఎంసీలే..
Tungabhadra Dam, Water Leva,l

  • గతేడాది 74.486 టీఎంసీలు

  • జూలై వచ్చినా కానరాని నీటిజాడ

  • ఆందోళనలో అన్నదాతలు

  • ఎల్‌నినో ప్రభావమేనా..?

బళ్లారి(బెంగళూరు): దక్షిణ భారత రైతాంగానికి జీవనాడి అయిన తుంగభద్ర జలాశయం నీటి సంక్షోభం ఎదుర్కొంటోంది. ఈ ఏడాది ఎల్‌నినో కారణంతో వర్షాలు ఇప్పటి వరకూ ఆశించినస్థాయిలో కురవలేదు. పశ్చిమ కనుమల్లో వర్షాలు బాగా కురవకపోవడంతో తుంగ, భద్ర నదుల నుంచి వరద ఏమాత్రం రావడం లేదు. గతేడితో పోల్చితో ఈ ఏడాది జీరో ఇన్‌ఫ్లో ఉంది. గతేది ఇదేనాటికి డ్యాంకు ఇన్‌ఫ్లో ఉధృతంగా ఉండింది. సరాసరి 74.486 టీఎంసీల నీళ్లు డ్యాంలో నిల్వ ఉన్నాయి.


ఈఏడాది ఇప్పటికి కేవలం 9 టీఎంసీలు మాత్రమే నీరు ఉంది. తుంగభద్రపై ఆశలు పెట్టకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. డ్యాం నుంచి నాలుగు ప్రధాన కాలువల కింద ఆయకట్టు సాగు అవుతోంది. అధికారుల అంచనా ప్రకారం 16 లక్షల ఎకరాల వరకూ ఆయకట్టుకు ఈ జలాశయం నీరు అందించాల్సి ఉంది. తుంగభద్ర ప్రధాన కాలువ(ఎల్‌బీసీ) కర్ణాటకలోని విజయనగర, బళ్లారి, కొప్పళ తదితర జిల్లాల్లో 6.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది.


pandu1.jpgకుడి దిగువ కాలువ (ఆర్‌బీఎల్‌ఎల్‌సీ) ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 3.60 లక్షల ఎకరాలు ఆయకట్టు ఉంది. కుడి ఎగువ కాలువ (ఎల్‌ఎల్‌సీ)అనంతపురం జిల్లాలోని 3 లక్షల ఎకరాల వరకు ఆయకుట్టు ఉంది. జలవిద్యుత్తు కోసం పవర్‌ కెనాల్‌ నుంచి తుంగభద్ర డ్యాం కింద 16 లక్షల ఎకరాలకు ఖరీఫ్‏లో సాగు నీరు అలాగే వందలాది గ్రామాలకు తాగునీరు అందించాలి.


  • ఖరీఫ్‏లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఆయకట్టు కింద వరి, పత్తి, చెరకు, మిరప, వేరుశనగ, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, పప్పుధాన్యాలు, ఉద్యాన పంటలు ఎక్కవగా సాగుచేస్తారు. ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న రైతులకు తుంగభద్రనే జీవనాధారం. అంతే కాకుండా హంపి సహ చారిత్రక ప్రాంతాల అభివృద్ధికి, పారిశ్రామిక అవసరాలకు తాగునీటి సరఫరాకు తుంగభద్ర జలాశయం ప్రధాన ఆధారం.


  • బచావత్‌ ట్రిబ్యునల్‌ 1976లో ఇచ్చిన అవార్డు ప్రకారం తుంగభద్ర జలాల వినియోగంపై కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల హక్కులు నిర్ణయించారు. ఈ అవార్డు ప్రకారం తుంగభద్ర ప్రాజెక్టు ద్వారా మొత్తం 220 టీఎంసీల నీటి వినియోగాన్ని గుర్తించగా ఇందులో కర్ణాటకకు 151 టీఎంసీ, ఆంధ్రాకు 79 టీఎంసీల వినియోగ హక్కు కల్పించారు. ప్రతి నీటి సంవత్సరం లభ్యమయ్యే నీటి నిల్వలు, వర్షాపాత పరిస్థితులను బట్టి తుంగభద్ర బోర్డు నీటి విడుదలను సమన్వయం చేస్తుంది. అయితే ఈ ఏడాది పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఎల్‌నినో ప్రభావం ఎగువ ప్రాంతాల్లో తక్కువ వర్షంపాతం. పెరుగుతున్న సాగు అవసరాలు, జలాశయంలో పూడిక పెరగడం, నీరు లేక పోవడం రైతుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. కనీసం ఈ ఏడాది తాగునీటికి కూడా నీరు అందే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తమవుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

లావుగా ఉందని భార్యను చంపేసిన భర్త..

కరుణించని వరుణుడు.. గత నెలలో 28 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 02 , 2026 | 01:40 PM