Share News

డ్యాన్స్ చేసిన అంకుల్, ఆంటీ.. వీడియో వైరల్

ABN , Publish Date - Jul 02 , 2026 | 01:03 PM

పాటకు అంకుల్, ఆంటీ డ్యాన్స్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది వైరల్‌గా మారింది. వీరి డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

డ్యాన్స్ చేసిన అంకుల్, ఆంటీ.. వీడియో వైరల్

ఇంటర్నెట్ డెస్క్: నృత్యం కేవలం వినోదం మాత్రమే కాదు. ఇది ఒక అద్భుతమైన వ్యాయామం కూడా. నృత్యంతో శరీరంలోని దాదాపు అన్ని కండరాలు ఉత్తేజం అవుతాయి. ఇలా చేయడం వల్ల శరీరంలోని కేలరీలు కరుగుతాయి. అలాగే శరీర బరువును అదుపులో ఉంచుతుంది. క్రమం తప్పకుండా నృత్యం చేయడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అంతేకాకుండా సంగీతానికి అనుగుణంగా నృత్యం చేస్తే.. ఒత్తిడి తగ్గి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. దీంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నృత్యం అనేది ఆరోగ్యం, సంతోషానికి దోహదం చేస్తుంది.


ప్రతిరోజూ సోషల్ మీడియాలో నృత్యానికి సంబంధించి లక్షలాది వీడియోలు వైరల్ అవుతుంటాయి. తమలోని నృత్య నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇది ఒక శక్తిమంతమైన వేదికగా ప్రస్తుతం మారింది. ఓ పల్లెటూరి మామయ్య, అత్తయ్య కలిసి సహజంగా నృత్యం చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. పూర్తిగా గ్రామీణ ప్రాంత ప్రజల్లా ఉన్న ఈ జంట చేసిన నృత్యానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. అత్యంత సహజంగా ఉన్న ఆ జంటను వారు అభినందనలతో ముంచెత్తుతున్నారు.


మరాఠీ ప్రముఖ నటుడు భావు కదమ్, గాయని గౌతమి పాటిల్ నటించిన హిల్ హిల్ పోరి హిలా పాట సంచలనం సృష్టిస్తోంది. చాలామంది ఈ పాటకు నృత్యం చేస్తూ రీల్స్ చేస్తున్నారు. ఓ పల్లెటూరుకు చెందిన భార్యభర్తలు ఈ పాటకు నృత్యం చేసిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియోను 90 వేల మందికిపైగా నెటిజన్లు వీక్షించారు. వేలకొద్ది లైకులు కూడా వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఈ జంట అద్భుతంగా నృత్యం చేశారని ఒకరు కామెంట్ చేశారు. వీరు అద్భుతమైన జోడి అని ఇంకొకరు అభివర్ణించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మురుగు కాలువలో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన ముంబై పోలీసులు.. వీడియో వైరల్

మరీ ఇంత దారుణమా? వీడియో వైరల్.. నిప్పులు చెరిగిన నెటిజన్లు

Updated Date - Jul 02 , 2026 | 02:09 PM