మరీ ఇంత దారుణమా? వీడియో వైరల్.. నిప్పులు చెరిగిన నెటిజన్లు
ABN , Publish Date - Jul 02 , 2026 | 12:15 PM
మూగ జీవులను హింసించడం మహా నేరం. వాటి పట్ల కొందరు వ్యవహరించే తీరు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తుంది. అవి జీవించి ఉండగానే కాదు.. మరణించిన తర్వాత కూడా వాటి పట్ల పలువురు చాలా కర్కశంగా వ్యవహరిస్తారు.
ఇంటర్నెట్ డెస్క్: మూగ జీవులను హింసించడం మహా నేరం. వాటి పట్ల కొందరు వ్యవహరించే తీరు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తుంది. అవి జీవించి ఉండగానే కాదు.. మరణించిన తర్వాత కూడా వాటి పట్ల పలువురు వ్యక్తులు చాలా కర్కశంగా వ్యవహరిస్తారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోను పరిశీలిస్తే అర్థమవుతుంది. భారతదేశంలో గోవు.. గోమాతగా పూజలు అందుకుంటుంది. దేశంలో అత్యధిక శాతం మంది ప్రజలు గోవులను పరమ పవిత్రంగా భావిస్తారు.
అలాంటి గోవు మృతి చెందితే.. దానిని నడి రోడ్డుపై ఆటో వెనుక తాడు కట్టి ఈడ్చుకెళ్లారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి విభిన్న రకాలుగా స్పందనలు వెల్లువెత్తాయి.
ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని బేతూల్ జిల్లాలో పార్ధ్వాడ్ రోడ్డుపై ఇటీవల చోటు చేసుకుంది. సదరు గోవును వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆ ఆవు అక్కడికక్కడే మరణించింది. ఈ గోవు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు యజమాని ముందుకు రాలేదు. దీంతో రెండు రోజుల పాటు రహదారి పక్కనే ఆ మృతదేహం పడి ఉంది. చివరకు పంచాయతీ సిబ్బంది రంగంలోకి దిగారు. అయితే ఆ మృతదేహాన్ని ఎత్తడానికి ట్రాక్టర్, ట్రాలీ అందుబాటులో లేవు.
దాంతో చెత్త డంప్ చేసే ఆటో ట్రక్కు వెనుక తాడుతో ఆవు మృతదేహాన్ని కట్టారు. అనంతరం డంపింగ్ యార్డుకు తరలించారు. ఈ లోగా ఆ చెత్త ట్రక్కును అనుసరిస్తూ ఓ వ్యక్తి.. ఈ మొత్తాన్ని తన వీడియోలో బంధించాడు. ఆ తర్వాత ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ గ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వేగంగా వస్తున్న రైలు ముందు ట్రాక్ దాటిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందో చూడండి!
న్యూయార్క్ టవర్‌పై ఎంగేజ్‌మెంట్.. పోలీసుల అదుపులో జంట