Share News

వేగంగా వస్తున్న రైలు ముందు ట్రాక్ దాటిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందో చూడండి!

ABN , Publish Date - Jul 02 , 2026 | 07:21 AM

ప్రయాణికుల భద్రత కోసం రైల్వే శాఖ అధిక ప్రాధాన్యం ఇస్తుంది. దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల భద్రత కోసం ఆ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది.

వేగంగా వస్తున్న రైలు ముందు ట్రాక్ దాటిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందో చూడండి!

ఇంటర్నెట్ డెస్క్: ప్రయాణికుల భద్రత కోసం రైల్వే శాఖ అధిక ప్రాధాన్యం ఇస్తుంది. దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల భద్రత కోసం ఆ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అందుకోసం ప్రతి ఏటా కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తుంది. రైల్వే ట్రాక్‌లను దాటవద్దు. రైల్వే స్టేషన్‌లో మరో ప్లాట్‌ఫారమ్‌కు వెళ్లడానికి మెట్లు లేదా లిఫ్ట్ ఉపయోగించండి. కదులుతున్న రైలు ఎక్కవద్దు. దిగవద్దు అంటూ పదే పదే సూచనలు చేస్తుంది. కొందరు ప్రయాణికులు వీటిని పెడచెవిన పెట్టి ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు.


దీంతో ఒకొక్కసారి ప్రాణాలు కూడా కోల్పోవాల్సిన వస్తుంది. ఈ తరహా ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఇలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. కేవలం కొన్ని సెకన్లలో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. రైల్వే శాఖ సూచనలను ఉల్లంఘించడం వల్ల ఎంత నష్టమో.. ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.


ఈ వీడియోలో ఓ వ్యక్తి రైల్వే ట్రాక్‌ను దాటుతున్నాడు. అదే సమయంలో ట్రాక్‌పై వేగంగా వస్తున్న రైలు.. అతడిని ఢీ కొడుతుంది. దీంతో సదరు వ్యక్తి.. గాలిలో ఎగిరి అవతల పడ్డాడు. ఈ సంఘటన కొన్ని సెకన్లలో జరిగిపోయింది. అయితే ఈ ప్రమాదం ఎక్కడ ఎప్పుడు జరిగిందనే దానిపై సమాచారం లేదు. ఈ వీడియో చూసిన తర్వాత అయినా ట్రాక్ దాటే సమయంలో ప్రజలు జాగ్రత్తలు పాటిస్తారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.


ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో చూస్తే.. రైల్వే ట్రాక్ దాటే ముందు ఒకటికి వందసార్లు ఆలోచిస్తారని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఇలాంటి పనులు చేసి అందమైన జీవితాన్ని కోల్పోవద్దు అని మరో నెటిజన్ సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

చిన్నారిని ఢీకొట్టిన ద్విచక్రవాహనం.. చూస్తే కన్నీళ్లు ఆగవు..

మా పేరు చెప్పగానే మైక్రోసాఫ్ట్‌లో 90 శాతం డిస్కౌంట్: శ్రీధర్ వెంబు

Updated Date - Jul 02 , 2026 | 09:03 AM