న్యూయార్క్ టవర్‌పై ఎంగేజ్‌మెంట్.. పోలీసుల అదుపులో జంట
ABN , Publish Date - Jul 02 , 2026 | 10:55 AM
అమెరికాలో నివసిస్తున్న రష్యా జంట పెద్ద సాహసమే చేసింది. న్యూయార్క్‌లో అత్యంత ఎత్తైన నిర్మాణాల్లో ఒకటైన ఎంపైర్ స్టేట్ భవనానికి సంబంధించిన టవర్ పైకి ఎక్కి ఎంగేజ్‌మెంట్ ఉంగరాలు మార్చుకుంది. పైనుంచి కిందకి దిగగానే వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో నివసిస్తున్న రష్యా జంట పెద్ద సాహసమే చేసింది. న్యూయార్క్‌లో అత్యంత ఎత్తైన నిర్మాణాల్లో ఒకటైన ఎంపైర్ స్టేట్ భవనానికి సంబంధించిన టవర్ పైకి ఎక్కి ఎంగేజ్‌మెంట్ ఉంగరాలు మార్చుకుంది. పైనుంచి కిందకు దిగగానే ఆ జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 443 మీటర్ల ఎత్తులో ఉన్న ఆ టవర్‌పై దాదాపు 10 నిమిషాల పాటు ఆ జంట గడిపింది. ఏంజెల్ నికోలవ్ చేతి వేలికి ఇవాన్.. ఎంగేజ్‌మెంట్ ఉంగరం తొడిగాడు. అనంతరం ఆమెకు ముద్దు కూడా పెట్టాడు.
నల్ల దుస్తులు ధరించిన వారు.. అదే రంగులో ఉన్న బ్యానర్‌ను టవర్‌పై ప్రదర్శించారు. దానిపై అధికార దాహాన్ని ప్రేమకు ఉన్న శక్తి అధిగమించినప్పడు.. ప్రపంచంలో శాంతి విల్లసిల్లుతుందని రాసి ఉంది. ఈ జంటను అరెస్ట్ చేసిన వీడియోను పోలీస్ కమిషనర్ జెస్సికా టిష్ విడుదల చేశారు. తమ అత్యవసర సేవల విభాగం పనితీరుకు ఇది ఒక ఉదాహరణ అని ఈ సందర్భంగా ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఘటన వల్ల భవనంలోని వారికి, సందర్శకులకు ఎలాంటి ఇబ్బందీ కలగలేదని న్యూయార్క్ ఎంపైర్ భవనం ప్రతినిధి వివరించారు. 2024లో స్కైవాకర్స్: ఎ లవ్ స్టోరీ స్ఫూర్తితో ఈ జంట ఈ విన్యాసం చేసినట్లు తెలుస్తోంది. మాస్కోకు చెందిన ఏంజెల్ నికోలవ్, ఇవాన్ జంట ప్రస్తుతం ఆమెరికాలో నివసిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మూగజీవిపై మమకారం.. రైలు ఇంజిన్‌లో చిక్కుకున్న నెమలిని ఎలా కాపాడారో చూశారా? వీడియో వైరల్
వేగంగా వస్తున్న రైలు ముందు ట్రాక్ దాటిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందో చూడండి!