Share News

మురుగు కాలువలో పడిపోయిన వ్యక్తి.. చివరకు ఏమైందో మీరే చూడండి..

ABN , Publish Date - Jul 02 , 2026 | 01:52 PM

ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మురుగు కాలువలు పొంగిపొర్లుతున్నాయి. తాజాగా, ఓ వ్యక్తి కాలువలో పడిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మురుగు కాలువలో పడిపోయిన వ్యక్తి.. చివరకు ఏమైందో మీరే చూడండి..

ముంబై, జులై 02: ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మురుగు కాలువలు పొంగిపొర్లుతున్నాయి. తాజాగా, ఓ వ్యక్తి కాలువలో పడిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ మురుగు కాలువలో పడి కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే రంగంలోకి దిగి, యువకుడిని రక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


పోలీసుల కథనం ప్రకారం.. దహిసర్‌ ప్రాంతంలోని ఓ మురుగు కాలువలో వ్యక్తి పడిపోయినట్లు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. కాలువలో పడిపోయిన వ్యక్తిని గుర్తించారు. తర్వాత కాలువపై ఉన్న జాలిని కత్తిరించారు. చివరకు యువకుడిని క్షేమంగా బయటకు తీశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. పోలీసులను అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.


భారీ వర్షాలతో ఇద్దరి మృతి

ముంబైలో కురిసిన భారీ వర్షాల వల్ల ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందారు. ఈ వారం ప్రారంభంలో స్కూల్ పిల్లలతో వెళ్తున్న వాహనంపై చెట్టు కూలింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మరీ ఇంత దారుణమా? వీడియో వైరల్.. నిప్పులు చెరిగిన నెటిజన్లు

డ్యాన్స్ చేసిన అంకుల్, ఆంటీ.. వీడియో వైరల్

Updated Date - Jul 02 , 2026 | 02:20 PM