లావుగా ఉందని భార్యను చంపేసిన భర్త..
ABN , Publish Date - Jul 02 , 2026 | 09:07 AM
కర్ణాటకలో దారుణ ఘటన వెలుగుచూసింది. భార్య లావుగా ఉందని తీవ్ర అసహనానికి గురైన భర్త ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు. కర్ణాటకలోని ధారవాడ జిల్లాలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
కర్ణాటకలో దారుణ ఘటన వెలుగుచూసింది. భార్య లావుగా ఉందని తీవ్ర అసహనానికి గురైన భర్త ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు. కర్ణాటకలోని ధారవాడ జిల్లాలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. స్టాఫ్ నర్సుగా పని చేస్తున్న ప్రియాంక కమలాకర్ (29)ను ఆమె భర్త బసవరాజ్ వడ్డార్ గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు (Karnataka Nurse killing).
2024 డిసెంబర్‌లో ప్రియాంక, బసవరాజ్‌లకు వివాహం జరిగింది. అయితే వివాహం జరిగిన కొద్ది రోజులకే ఆమె వైవాహిక జీవితం నరకంగా మారింది. భర్తతో పాటు అతడి కుటుంబ సభ్యులు అదనపు కట్నం, నగదు, బంగారం తీసుకురావాలని నిరంతరం ఒత్తిడి తెచ్చేవారని, ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించేవారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రియాంక లావుగా ఉందంటూ తరచూ అవమానించేవారని, 'నువ్వు నాకు నచ్చలేదు', 'నువ్వు పిల్లలకు జన్మనివ్వలేవు' అంటూ భర్త తరచుగా దూషించేవాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు (Husband killed wife).
వివాహం తర్వాత ప్రియాంక రెండుసార్లు గర్భం దాల్చినా, భర్త తరచూ చేసిన దాడుల కారణంగా రెండుసార్లూ గర్భస్రావం జరిగిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు (Karnataka Crime News). సోమవారం రాత్రి హనసి గ్రామంలోని ఇంట్లో బసవరాజ్ ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు రోజుల తర్వాత ఈ ఘటన వెలుగులోకి రావడంతో గ్రామంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త బసవరాజ్ వడ్డార్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులను అరెస్టు చేసి విచారణ చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
బంగారం ధరలు మరింత కిందకు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
మీ పెంపుడు శక్తులను అదుపులో పెట్టుకోండి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్