Share News

ఎన్టీపీసీ 176 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టు పూర్తి

ABN , Publish Date - Jul 02 , 2026 | 12:33 PM

రామగుండం ఎన్టీపీసీలోని బ్యాలెన్స్‌ రిజర్వా యర్‌లో 176మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి వాణిజ్య ఉత్పత్తి దశలో కి చేరుకుంది.

ఎన్టీపీసీ 176 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టు పూర్తి
NTPC solar project, Ramagundam

  • దక్షిణాదిలో అతిపెద్ద ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టుగా గుర్తింపు

జ్యోతినగర్‌(కరీంనగర్): రామగుండం ఎన్టీపీసీలోని బ్యాలెన్స్‌ రిజర్వా యర్‌లో 176మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి వాణిజ్య ఉత్పత్తి దశలో కి చేరుకుంది. తాజాగా మంగళవారం చివరి 41.6మెగావాట్ల యూనిట్‌ కమర్షియల్‌ ఆపరేషన్‌లోకి వచ్చింది. ఈ ప్రాజెక్టులో 56మెగా వాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌, 120మెగావాట్ల సర్ఫేస్‌సోలార్‌ ప్రాజెక్టును నిర్మించారు. ఎన్టీపీసీ రిజర్వాయర్‌లో ఇంతకుముందు 100మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టును నిర్మించారు. మూడేళ్లుగా ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యంతో పనిచేస్తుంది. ఈక్రమంలో ఈప్రాజెక్టు విస్తరణను ఎన్టీపీసీ యాజ మాన్యం చేపట్టింది.


solar1.jpg176మెగావాట్ల కంబైన్డ్‌ సోలార్‌ ప్రాజెక్టుకు సంబంధించి తొలిదశ వంద మెగావాట్లు గత మే 2న, రెండో దశ 34.4 మెగావాట్లు మే29న వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించాయి. తాజాగా మిగిలిన 41.6 మెగావాట్లు మంగళవారం నుంచి అందు బాటులోకి వచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా ఎన్టీపీసీ సంస్థ మొత్తం స్థాపిత విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 90,899మెగావాట్లకు, వాణిజ్య విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యం 89,819 మెగావాట్లకు పెరిగింది. రామగుండం ఎన్టీపీసీ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో నెలకొ ల్పిన 156 మెగావాట్ల ప్లోటింగ్‌ సౌర విద్యుత్‌కేంద్రం దక్షిణాదిలోనే అతిపెద్దదిగా గుర్తింపు పొందింది.


ఈ వార్తలు కూడా చదవండి:

లావుగా ఉందని భార్యను చంపేసిన భర్త..

కరుణించని వరుణుడు.. గత నెలలో 28 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 02 , 2026 | 12:33 PM