Share News

జగన్ తీరు అందరికీ తెలుసు: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

ABN , Publish Date - Jul 02 , 2026 | 10:54 AM

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ తీరు అందరికీ తెలుసన్నారు.

జగన్ తీరు అందరికీ తెలుసు: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
Somireddy Chandramohan Reddy

అమరావతి, జులై 2: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈరోజు(గురువారం) మీడియాతో మాట్లాడుతూ.. జగన్ తీరు అందరికీ తెలుసన్నారు. అమరావతి, మావిగన్‌కు పోటీ అని వైసీపీ అధినేత అంటున్నారని మండిపడ్డారు. ఏపీ భవిష్యత్తు నాశనం కావాలని జగన్ మావిగన్ అంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌కు మానవత్వం లేదన్నారు. ఇది విజనరీ, మెంటల్‌ కేసుకు మధ్య పోటీ అంటూ దుయ్యబట్టారు. మొదట ‘అమరావతి’ తర్వాత ‘మూడు రాజధానులు’ ఇప్పుడు ‘మావిగన్’ అంటూ జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.


జగన్ ఏం చెబుతున్నారో ఆయనకే అర్ధంకాని పరిస్థితి ఉందని ఎమ్మెల్యే అన్నారు. అమరావతిలో వేల కోట్ల పెట్టుబడులు వస్తుంటే... జగన్‌కు మాత్రం విధ్వంస రాజకీయాలే కనిపిస్తున్నాయని మండిపడ్డారు. లోక్‌సభలో అన్ని పార్టీలు అమరావతికి మద్దతు ఇస్తున్నామని చెబితే.. ఒక్క వైసీపీ నేతలు మాత్రం బాయ్‌కాట్ చేసి బయటకు వెళ్లారని విరుచుకుపడ్డారు. గత ఎన్నికల్లో 3 రాజధానులంటూ వెళ్తే 11 సీట్లు వచ్చాయని తెలిపారు. రేపు మావిగన్ పేరుతో వెళ్తే ఒకటో, రెండో సీట్లు వస్తాయన్నారు. జగన్‌కు ఏం కావాలో తెలియట్లేదని.. జేబులో గన్‌, చేతిలో గొడ్డలి కావాలేమో అంటూ వ్యాఖ్యానించారు.


రైతుల త్యాగాలతో నిర్మితమైన రాజధానిపై కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. గత ఐదేళ్లు అమరావతి నుంచే పాలన చేసిన జగన్ ఇప్పుడు అదే రాజధానిపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. రూ.57,821 కోట్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్న అమరావతిని అడ్డుకోవడం రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమన్నారు. కూటమి ప్రభుత్వం పెట్టుబడులు తెస్తుంటే... జగన్ పెట్టుబడిదారులను భయపెట్టే రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాష్ట్ర భవిష్యత్తు.. దాన్ని అడ్డుకునే రాజకీయాలకు ప్రజలే ఫుల్‌స్టాప్ పెడతారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ముందే గుర్తిస్తే క్యాన్సర్‌కు చెక్‌

విద్యుత్ అంతరాయాల నివారణకు వేగవంతంగా చర్యలు: మంత్రి గొట్టిపాటి రవికుమార్

Read Latest AP News And Telangana News

Updated Date - Jul 02 , 2026 | 11:51 AM