శ్రీశైలం మల్లన్న భక్తులకు అలర్ట్.. ఆ దర్శనం నిలిపివేత
ABN , Publish Date - Jul 12 , 2026 | 05:50 PM
శ్రీశైలం మల్లన్న స్పర్శ (బ్రేక్) దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రకటించారు. వారాంతపు సెలవులు కావడంతో క్షేత్రానికి అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగిందని పేర్కొన్నారు.
నంద్యాల జిల్లా, జులై 12 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం మల్లన్న (Srisailam Temple) స్పర్శ (బ్రేక్) దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రకటించారు. వారాంతపు సెలవులు కావడంతో క్షేత్రానికి అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగిందని పేర్కొన్నారు. భక్తుల రద్దీ కారణంగా ఈరోజు (ఆదివారం), రేపు (సోమవారం) విరామ వీఐపీ (బ్రేక్) దర్శనాలను నిలిపివేసినట్లు తెలిపారు. సిఫారసు లేఖలతో వచ్చే వారికి కూడా స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.
ఇప్పటికే మనమిత్ర వాట్సాప్, ఆన్‌లైన్లో స్పర్శ దర్శన టికెట్లను పొందినవారికి నిర్థిష్ట వేళల్లో స్పర్శ దర్శనానికి అవకాశం ఇచ్చినట్లు వెల్లడించారు. క్యూలైన్‌లో సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగకుండా స్పర్శ దర్శనం రద్దు చేయాలని నిర్ణయించామని చెప్పుకొచ్చారు. క్యూ లైన్ల నిర్వహణ సీసీటీవీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఆలయ ఈవో శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జనాభా నియంత్రణ కాదు.. జనాభా సంరక్షణే లక్ష్యం: సీఎం చంద్రబాబు
యువత పరిశోధనలు, ఆవిష్కరణలు స్టార్టప్‌ల వైపు అడుగులు వేయాలి: గవర్నర్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News