వైసీపీ నేతల అరాచకాలన్నీ బయటకు తీస్తా.. టీడీపీ కార్యకర్త చివరి వీడియో వైరల్
ABN , Publish Date - Aug 14 , 2026 | 07:40 AM
కర్నూలు జిల్లా పాతబస్తీకి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇంతియాజ్ చివరి వీడియో వైరల్ అయింది. ఆయన హత్యకు ముందు సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఈ వీడియో విడుదల చేశారు.
కర్నూలు, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా పాతబస్తీకి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇంతియాజ్ (TDP Activist Imtiyaz) చివరి వీడియో వైరల్ అయింది. ఆయన హత్యకు ముందు సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఈ వీడియో విడుదల చేశారు. తన ఫొటోతో ‘RIP’ పోస్ట్ పెట్టడంపై ఇంతియాజ్ తీవ్రంగా స్పందించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఎవరి స్థలం కబ్జా చేయలేదని స్పష్టం చేశారు.
తనకు కొంతమంది నుంచి బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని, తమ ఇంటికి వచ్చి వెళ్తున్నారని వీడియోలో ఇంతియాజ్ వెల్లడించారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా లొంగేది లేదని స్పష్టం చేశారు. వైసీపీ నేతల అన్యాయాన్ని, అరాచకాలను తాను బయటపెడతానని తేల్చిచెప్పారు. వైసీపీ నేతలు తప్పు చేయడమే కాకుండా.. తన ఫొటోతో ‘RIP’ పోస్ట్ పెడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ నేతల అరాచకాలన్నీ బయటకు తీస్తా అంటూ ఇంతియాజ్ ఈ వీడియోలో పేర్కొన్నారు. ఆయన హత్యకు ముందు ఇంతియాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇంతియాజ్ హత్యకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు చేయాలని పోలీసులను టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.
వార్తలు కూడా చదవండి...
సింగపూర్ మోడల్‌తో అమరావతిని నిర్మిస్తున్నాం: సీఎం చంద్రబాబు
వన్యప్రాణుల సంరక్షణ ప్రజా ఉద్యమంగా మారాలి: పవన్ కల్యాణ్
సీడ్ యాక్సెస్ రోడ్డులో S ఆకారపు మలుపుపై అపోహలు వద్దు: ఏపీ సర్కార్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News