నంద్యాల జిల్లాలో ఆ పులి మరణంపై క్లారిటీ ఇచ్చిన హెచ్ఎల్‌సీ అధికారులు
ABN , Publish Date - Aug 06 , 2026 | 08:56 PM
నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు అటవీ డివిజన్‌లో పులి మృతిపై ఉన్నత స్థాయి కమిటీ క్షేత్రస్థాయి విచారణ చేపట్టిందని డిప్యూటీ డైరెక్టర్ విగ్నేశ్ అప్పావ్ పేర్కొన్నారు.
నంద్యాల జిల్లా, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు అటవీ డివిజన్‌లో పులి (T-66F)మృతిపై (Nandyal District Tiger) ఉన్నత స్థాయి కమిటీ (HLC) క్షేత్రస్థాయి విచారణ చేపట్టిందని డిప్యూటీ డైరెక్టర్ విగ్నేశ్ అప్పావ్ పేర్కొన్నారు. ముళ్లపందిని వేటాడే క్రమంలో ముళ్లు గుచ్చుకుని తీవ్ర గాయాలతోనే ఆడపులి మృతి చెందినట్లు వెల్లడించారు. ఆ పులి శరీర అవయవాలన్నీ భద్రంగానే ఉన్నాయని తెలిపారు.
వేటగాళ్ల హస్తం గానీ, ఎలాంటి కుట్ర గానీ లేదని విగ్నేశ్ అప్పావ్ స్పష్టం చేశారు. పులి గర్భవతి అని, పిల్లలు కనిపించడం లేదంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని అటవీ శాఖ అధికారులు తేల్చిచెప్పారు. జులై 20, 21, 22 తేదీల కెమెరా ట్రాప్ దృశ్యాల ద్వారా పులిపై ముళ్లపంది గాయాలున్నట్లు గుర్తించామని అన్నారు. అటవీ ప్రాంతంలో డ్రోన్ గస్తీ, బేస్ క్యాంప్‌లు, ఏపీఎస్పీడీసీఎల్ (APSPDCL) సమన్వయంతో రక్షణ చర్యలు ముమ్మరం చేశామని విగ్నేశ్ అప్పావ్ పేర్కొన్నారు.
వార్తలు కూడా చదవండి...
విశాఖ ఎకనామిక్ రీజియన్ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్
పవన్ కల్యాణ్ ఆదేశాలతో పులుల మరణాలపై అధికారుల ముమ్మర తనిఖీలు.. పట్టుబడ్డ పులిగోర్లు
ప్రపంచ స్థాయి క్రీడాకారులను పీవీ సింధు అకాడమీ తయారు చేస్తోంది: లోకేశ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News