Share News

నందికొట్కూరులో మరో 30-40 ఏళ్లు టీడీపీదే అధికారం: ఎంపీ బైరెడ్డి శబరి

ABN , Publish Date - Nov 16 , 2026 | 04:01 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు.

నందికొట్కూరులో మరో 30-40 ఏళ్లు టీడీపీదే అధికారం: ఎంపీ బైరెడ్డి శబరి
MP Byreddy Shabari

నంద్యాల, నవంబర్ 16: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. ఈరోజు (సోమవారం) ​నందికొట్కూరు మున్సిపాలిటీ 29, 30వ వార్డు కౌన్సిలర్లు, కార్యకర్తలతో ఎంపీ సమావేశమయ్యారు. ​నందికొట్కూరులో గత ఎన్నికల్లో టీడీపీ ఓటమికి గల కారణాలపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ​రాయలసీమను రత్నాల సీమగా మారుస్తున్నామని తెలిపారు. ​రాబోయే 30-40 ఏళ్ల పాటు నందికొట్కూరులో టీడీపీ జెండానే ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. ​


బయటి నుంచి వచ్చి పెత్తనం చేస్తే కార్యకర్తలు చూస్తూ ఊరుకోరంటూ ఎంపీ వ్యాఖ్యానించారు. ​పార్టీ కోసం కష్టపడతామని.. ఎవరికీ తలవంచే ప్రసక్తే లేదని ఎంపీ బైరెడ్డి శబరి స్పష్టం చేశారు. ఈరోజు నందికొట్కూరులో ఎంపీ పర్యటించారు. ఈ సందర్భంగా ​హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జమ్మి చెట్టు వద్ద నూతన శివాలయ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ​ఆలయ నిర్మాణానికి, అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని ఎంపీ శబరి హామీ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి...

ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే!

అమిత్ షా పర్యటన.. విజయవాడలో ‘నో ఫ్లైయింగ్ జోన్‌’ అమలు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 16 , 2026 | 04:09 PM