మేడ్చల్ జిల్లాలో ముసుగు దొంగల కలకలం.. ఏడాదిలో ఎనిమిది చోరీలు
ABN , Publish Date - Nov 16 , 2026 | 03:13 PM
మేడ్చల్ జిల్లాలోని పర్వతాపూర్ బీపీఎం గ్రీన్‌ల్యాండ్ కాలనీలో ముసుగులు ధరించిన దొంగల ముఠా స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నారు. ఈ ముఠా ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని వరుసగా దొంగతనాలకు పాల్పడుతోంది.
మేడ్చల్ జిల్లా, నవంబర్ 16: జిల్లాలోని పర్వతాపూర్ బీపీఎం గ్రీన్‌ల్యాండ్ కాలనీలో ముసుగులు ధరించిన దొంగల ముఠా స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నారు. ఈ ముఠా ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని వరుసగా దొంగతనాలకు పాల్పడుతోంది. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు దొంగలు కాలనీల్లో సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఏడాది కాలంలో ఈ ప్రాంతంలో మొత్తం ఎనిమిది చోరీలు జరిగినట్లు తెలుస్తోంది. కేవలం రెండు నెలల్లోనే నాలుగు దొంగతనాలు చోటుచేసుకోవడం స్థానికులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
దొంగలు చోరీలకు పాల్పడే ముందు కాలనీలో రెక్కీ నిర్వహిస్తున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. కొన్ని ఇళ్ల వద్ద రాళ్లు పెట్టి గుర్తులు కూడా పెడుతున్నట్లు చెబుతున్నారు. దొంగల ముఠా పక్కా ప్రణాళికతో చోరీలకు పాల్పడుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముసుగులు ధరించిన దుండగులు అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు.. చేతుల్లో ఆయుధాలు పట్టుకుని తిరుగుతుండటం స్థానికంగా కలకలం రేపుతున్నాయి.
కొందరు దుండగులు ఇళ్ల పరిసరాలను పరిశీలిస్తూ అనుమానాస్పదంగా తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. వరుస చోరీలు, దొంగల సంచారంతో గ్రీన్‌ల్యాండ్ కాలనీవాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో పోలీసులు పెట్రోలింగ్‌ను మరింత పెంచాలని కోరుతున్నారు. వరుసగా ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగలు చోరీలకు పాల్పడుతుండటంతో కాలనీలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు భయపడుతున్న పరిస్థితి.
ఇవి కూడా చదవండి...
ఏఐ దుర్వినియోగానికి చెక్ పెట్టండి.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి చిరంజీవి వినతి
పోలీస్ శాఖల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుండటం శుభపరిణామం: డీజీపీ ఆనంద్
Read Latest Telangana News And Telugu News