Share News

పోలీస్ శాఖల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుండటం శుభపరిణామం: డీజీపీ ఆనంద్

ABN , Publish Date - Nov 16 , 2026 | 01:21 PM

పోలీస్, మార్షల్ బ్యాండ్ సంప్రదాయానికి శతాబ్దాల చరిత్ర ఉందని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. ఈరోజు (సోమవారం) హకీంపేట సీఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్‌లో 27వ ఆల్ ఇండియా పోలీస్ బ్యాండ్ పోటీలను డీజీపీ ప్రారంభించారు.

పోలీస్ శాఖల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుండటం శుభపరిణామం: డీజీపీ ఆనంద్
DGP CV Anand

హైదరాబాద్, నవంబర్ 16: పోలీస్, మార్షల్ బ్యాండ్ సంప్రదాయానికి శతాబ్దాల చరిత్ర ఉందని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. ఈరోజు (సోమవారం) హకీంపేట సీఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్‌లో 27వ ఆల్ ఇండియా పోలీస్ బ్యాండ్ పోటీలను డీజీపీ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. పోలీస్ బ్యాండ్ బలగాలు.. క్రమశిక్షణ, ఐక్యత, ఆత్మగౌరవానికి ప్రతీకగా చెప్పుకొచ్చారు. ఈ ఏడాది పోటీల్లో తొలిసారిగా మహిళా బ్యూగ్లర్లు పాల్గొనడం అభినందనీయమన్నారు. సీఆర్పీఎఫ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి మహిళా బ్యూగ్లర్ల భాగస్వామ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని తెలిపారు.


పోలీస్ శాఖల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుండటం శుభపరిణామమని డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన బ్యాండ్ బృందాలకు తెలంగాణ తరఫున సాదర స్వాగతం పలికారు. హైదరాబాద్‌లోని గోల్కొండ కోట, సాలార్‌జంగ్ మ్యూజియం సందర్శించాలన్నారు. హైదరాబాద్ బిర్యానీ, హలీమ్ రుచులను ఆస్వాదించడం మర్చిపోవద్దని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన బ్యాండ్ బృందాలకు తెలిపారు. గతంలో నక్సలైట్లకు వ్యతిరేకంగా సీఆర్పీఎఫ్, తెలంగాణ పోలీసులు కలిసి పనిచేశారని గుర్తుచేశారు. దేశ భద్రతలో పోలీస్ బలగాల మధ్య సమన్వయం ఎంతో కీలకమని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఉద్యోగం కోసం మలేసియా వెళ్లి జైలుపాలైన కామారెడ్డి యువకుడు

ఏఐ దుర్వినియోగానికి చెక్ పెట్టండి.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి చిరంజీవి వినతి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 16 , 2026 | 01:48 PM