Share News

మొయినాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారి వాణి ఇంట్లో ఏసీబీ సోదాలు

ABN , Publish Date - Nov 16 , 2026 | 11:45 AM

మొయినాబాద్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి వాణి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. వాణి నివాసంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.

మొయినాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారి వాణి ఇంట్లో ఏసీబీ సోదాలు
ACB Raids

రంగారెడ్డి, నవంబర్ 16: మొయినాబాద్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి వాణి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. వాణి నివాసంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. టౌన్ ప్లానింగ్‌లో పని చేస్తూ పెద్దఎత్తున ఆస్తులను కూడబెట్టినట్లుగా వాణిపై ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతోంది.


సెప్టెంబర్ 30న లంచం తీసుకుంటూ గుండు వాణి, సీనియర్ అసిస్టెంట్ యలమోని సుదర్శన్.. ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు వాణి రూ.75 వేలు లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు గుర్తించారు. వాణి తరఫున లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు సుదర్శన్ పట్టుబడ్డాడు. మున్సిపల్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్‌గా సుదర్శన్ పనిచేస్తున్నాడు.


సుదర్శన్ వద్ద నుంచి రూ.75 వేల నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు.. ఆదాయానికి మించి ఆస్తుల కేసును నమోదు చేశారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో భాగంగానే తాజాగా అత్తాపూర్‌లోని వాణి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.


ఇవి కూడా చదవండి...

ఉద్యోగం కోసం మలేసియా వెళ్లి జైలుపాలైన కామారెడ్డి యువకుడు

బొత్స అనూషపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం.. పోలీసులకు ఫిర్యాదు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 16 , 2026 | 11:45 AM