ఆదోని మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగి నరసమ్మపై దాడి కేసులో కీలక మలుపు
ABN , Publish Date - Sep 07 , 2026 | 08:41 AM
ఆదోని మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగి నరసమ్మపై దాడి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. రెండు నెలల క్రితం ఈరన్న అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
కర్నూలు జిల్లా, సెప్టెంబర్ 7 (ఆంధ్రజ్యోతి): ఆదోని మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగి నరసమ్మపై దాడి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. రెండు నెలల క్రితం ఈరన్న అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈరన్న ఆత్మహత్యకు నరసమ్మే కారణమని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆమెపై కారం, పెట్రోల్ పోసి దాడికి ఈరన్న కుటుంబ సభ్యులు పాల్పడ్డారు.
ఈ ఘటనపై ఆదోని టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నరసమ్మపై దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. తీవ్ర గాయాలతో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
టీడీపీ నాయకత్వానికి కొత్త దిశ.. చంద్రబాబు- లోకేశ్ సమక్షంలో లీడర్‌షిప్ కాంక్లేవ్
పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవ.. ఉప్పాడ తీర రక్షణకు కీలక చర్యలు
వంగవీటి రాధాను పాస్‌పోర్ట్ వ్యవహారంలో మోసం చేసేందుకు బ్రోకర్ యత్నం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News