40 ఏళ్ల ఏకగ్రీవ సంప్రదాయానికి బ్రేక్.. కర్నూలు జిల్లా కడిమెట్లలో ఆసక్తికర పోరు
ABN , Publish Date - Nov 05 , 2026 | 03:45 PM
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామంలో గత 40 ఏళ్లుగా కొనసాగుతున్న ఏకగ్రీవ ఎన్నికల సంప్రదాయానికి ఈసారి బ్రేక్ పడింది. తొలిసారిగా పోటీ వాతావరణంలో ఎన్నికలు జరగుతుండటంతో రాజకీయంగా తీవ్ర ఆసక్తి నెలకొంది.
కర్నూలు జిల్లా, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామంలో గత 40 ఏళ్లుగా కొనసాగుతున్న ఏకగ్రీవ ఎన్నికల సంప్రదాయానికి ఈసారి బ్రేక్ పడింది. తొలిసారిగా పోటీ వాతావరణంలో ఎన్నికలు జరగుతుండటంతో రాజకీయంగా తీవ్ర ఆసక్తి నెలకొంది. కూటమి ప్రభుత్వ హయాంలో తొలిసారిగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తుండటంతో స్థానికంగా రాజకీయాలు వేడెక్కాయి.
ఎర్రకోట, కడిమెట్ల గ్రామాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం నుంచే ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ముఖ్యంగా ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఈ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి. నాలుగు దశాబ్దాల ఏకగ్రీవ ఎన్నికల సంప్రదాయానికి తెరపడటంతో ఈసారి ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. స్థానిక నాయకుల రాజకీయ భవిష్యత్తుకు ఈ ఎన్నికలు కీలకంగా మారనున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
నాంది ఫౌండేషన్ 28 ఏళ్ల ప్రస్థానం.. ఆనంద్ మహీంద్రాకు చంద్రబాబు థ్యాంక్స్
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు పటిష్ఠ ప్రణాళిక: ఏపీ ఎస్‌ఈసీ
ఏలూరు జిల్లాలో వరదలు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News