సౌత్ కోస్టల్ రైల్వే జీఎం మాథుర్‌ను కలిసిన ఎంపీ శివనాథ్
ABN , Publish Date - Aug 01 , 2026 | 01:28 PM
సౌత్ కోస్టల్ రైల్వే జీఎం మాథుర్‌ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ శనివారం కలిశారు. జీఎం మాథుర్‌ను కలిసి పలు కీలక అంశాలపై చర్చించామని తెలిపారు.
విజయవాడ, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): సౌత్ కోస్టల్ రైల్వే జీఎం మాథుర్‌ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) (Kesineni Shivanath) ఈరోజు(శనివారం) కలిశారు. జీఎం మాథుర్‌ను కలిసి పలు కీలక అంశాలపై చర్చించామని తెలిపారు. కొండపల్లి రైల్వేస్టేషన్‌ను కూడా అమృత్ భారత్ కింద అభివృద్ధి చేయాలని అడిగామని చెప్పారు. విజయవాడ చుట్టుపక్కల రైల్వే సమస్యల గురించి తెలిపామని అన్నారు. విజయవాడకు ట్రాఫిక్ సమస్య తీరేలా 8 ఆర్వోబీల ఏర్పాటు గురించి మాట్లాడామని తెలిపారు. ఎర్రకట్ట వంతెన పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాలకు అతి ముఖ్యమని చెప్పుకొచ్చారు.
గుణదల LC-8 కూడా చాలా అవసరమని తెలిపామని ఎంపీ శివనాథ్ అన్నారు. విజయవాడ రైల్వేస్టేషన్ అభివృద్ధికి టెండర్లు వేసినా ఎవరూ రాలేదని చెప్పారు. కేంద్ర రైల్వేమంత్రిని ఎంపీలందరం కలిసి విజయవాడను అమృత్ భారత్ కింద అభివృద్ధి చేయాలని కోరుతామని అన్నారు. విజయవాడ - బెంగళూరు వయా గుత్తి రైల్వేలైన్ కావాలని కేంద్రమంత్రిని తాము అడుగుతామని ఎంపీ శివనాథ్ పేర్కొన్నారు.
వార్తలు కూడా చదవండి...
భోగాపురంలో థింసా నృత్యానికి గిన్నిస్ రికార్డు
పవన్ కల్యాణ్ ఆదేశాలతో కళాకారులకు ఉచిత కంటి పరీక్షలు
ఏపీలో విపత్తు నిర్వహణ వ్యవస్థలపై కేంద్ర ఉన్నతాధికారుల సమీక్ష
Read Latest AP News And Telangana News And National News
And Telugu News