Share News

టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత

ABN , Publish Date - May 02 , 2026 | 11:34 AM

రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉమ్మడి కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత వల్లభనేని బాబురావు తుదిశ్వాస విడిచారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని తన స్వగృహంలో కన్నుమూశారు.

టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
Vallabhaneni Baburao

కృష్ణాజిల్లా గుడివాడ, మే2 (ఆంధ్రజ్యోతి): రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉమ్మడి కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత వల్లభనేని బాబురావు (Vallabhaneni Baburao) తుదిశ్వాస విడిచారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని తన స్వగృహంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. బాబురావు టీడీపీ వ్యవస్థాపక కాలం నుంచి పార్టీలో క్రియాశీలక నేతగా పనిచేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం ఆయన సేవలందించారు.


ఆయన మృతి వార్త తెలియగానే కృష్ణా జిల్లాకు చెందిన కూటమి నేతలు (టీడీపీ, జనసేన, బీజేపీ), కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆయన స్వగృహానికి చేరుకున్నారు. బాబురావు భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆయన మరణం జిల్లా రాజకీయాలకు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి తీరని లోటని నేతలు పేర్కొన్నారు. వల్లభనేని బాబురావు మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

జగన్‌కు మానసిక సమస్య ఉంది.. సీఎం సెటైర్లు

శ్రామికులే దేశ అభివృద్ధికి బలం: మంత్రి నారా లోకేశ్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 02 , 2026 | 11:48 AM