Share News

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్

ABN , Publish Date - May 08 , 2026 | 09:58 AM

కృష్ణాజిల్లా కంకిపాడు జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఎమ్మెల్యే బోడేప్రసాద్ మానవత్వంతో స్పందించారు.

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్
Bode Prasad

కృష్ణాజిల్లా, మే 8 (ఆంధ్రజ్యోతి): కృష్ణాజిల్లా కంకిపాడు జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. గుణదల మేరీమాత దర్శనం ముగించుకుని చిన్నపాపతో తిరుగు ప్రయాణం చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదానికి గురయ్యారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న తెలుగుదేశం పార్టీ పెనమలూరు ఎమ్మెల్యే బోడేప్రసాద్ (Bode Prasad) వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ఎలాంటి ఆలస్యం చేయకుండా 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి క్షతగాత్రులను క్యాపిటల్ హాస్పిటల్‌కు తరలించే ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే చొరవతో బాధితులకు సమయానికి వైద్యం అందింది.


సహాయక చర్యల్లో పాల్గొన్న ఎమ్మెల్యే..

ప్రమాద బాధితులను ఆస్పత్రికి తరలించిన అనంతరం ఎమ్మెల్యే నేరుగా క్యాపిటల్ హాస్పిటల్‌కు వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. క్షతగాత్రుల ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని తెలుసుకున్న ఎమ్మెల్యే వారికి అవసరమైన వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అవసరమైన ఆర్థిక సహకారం అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వైద్యులకు సూచించారు.


ప్రమాదాల సమయంలో స్పందించాలి: ఎమ్మెల్యే

ప్రమాదాలను చూసి భయపడకుండా ప్రతి ఒక్కరూ బాధితులకు సహాయం చేయాలని ఎమ్మెల్యే బోడేప్రసాద్ కోరారు. నెలల పాపతో మేరీమాత దర్శనం చేసుకుని వస్తున్న కుటుంబం ప్రమాదానికి గురవడం ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాల సమయంలో గోల్డెన్ అవర్ ఎంతో కీలకమని, ఆ సమయంలో సరైన వైద్యం అందితే ప్రాణాలు కాపాడవచ్చని అన్నారు. ప్రమాద సమయంలో వెంటనే స్పందించి అంబులెన్స్‌కు సమాచారం అందిస్తే అనేక మంది ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు. ప్రమాద బాధితులను ఆదుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి జాగ్రత్తగా ప్రయాణాలు చేయాలని ఎమ్మెల్యే బోడేప్రసాద్ సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

పెట్టుబడుల కోసం 28 ఉత్తమ విధానాలు: సీఎం చంద్రబాబు

పిఠాపురం టీడీపీలో కీలక మార్పులు.. ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి వర్మ తొలగింపు

ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం.. ప్రజలను అవమానించడమే: కమల్ హాసన్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 08 , 2026 | 10:17 AM