Share News

బాలికపై అత్యాచారం..! ఆ తర్వాత ఏం జరిగిందంటే.?

ABN , Publish Date - Mar 19 , 2026 | 09:22 PM

మచిలీపట్నంలో బాలికపై అత్యాచారం జరిగింది. ఆ బాలిక గర్భం దాల్చడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

బాలికపై అత్యాచారం..! ఆ తర్వాత ఏం జరిగిందంటే.?
Machilipatnam Incident

కృష్ణా, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): మచిలీపట్నంలో బాలికపై అత్యాచారం జరిగింది. ఆ బాలిక గర్భం దాల్చడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మచిలీపట్నం ఇన్‌చార్జి డీఎస్పీ కె. ధర్మేంద్ర, ఆర్‌పేట సీఐ ఏసుబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మచిలీపట్నం నిజాంపేటకు చెందిన పూజారి రఘు (41) ఇంట్లో ఒక కుటుంబం అద్దెకు ఉంటుంది. వాళ్లకు ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి ఉంది.


ఆ అమ్మాయిని ప్రలోభపెట్టి రఘు మూడుసార్లు అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఆ బాలిక నీరసంగా ఉండటం అనారోగ్యానికి గురవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు హాస్పిటల్‌కు తీసుకెళ్లగా గర్భవతి అని తేలింది. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు కూతురిని నిలదీయగా అసలు విషయం బయటకు వచ్చింది. ఈ విషయంపై మచిలీపట్నం ఆర్‌పేట పోలీసులకు తల్లిదండ్రులు ఈ నెల 18వ తేదీన ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని గురువారం అదుపులోకి తీసుకుని అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు. అమ్మాయిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఐదు రకాల బస్సుల్లో దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించొచ్చు: సీఎం

విశాఖ రైల్వేజోన్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభం: అశ్వినీ వైష్ణవ్

జగన్ హయాంలో వివేకా హత్య కేసులో ఏ ఒక్క ఆధారమైనా ఎందుకు బయటపెట్టలేదు.. షర్మిల ధ్వజం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Mar 19 , 2026 | 09:35 PM