Share News

బీసీ విద్యార్థుల విద్యకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది: మంత్రి సవిత

ABN , Publish Date - Jul 12 , 2026 | 02:24 PM

బీసీ విద్యార్థుల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని ఏపీ మంత్రి సవిత వ్యాఖ్యానించారు. సన్నబియ్యంతో రుచికరమైన భోజనం అందిస్తున్నామని పేర్కొన్నారు.

బీసీ విద్యార్థుల విద్యకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది:  మంత్రి సవిత
AP Minister Savitha

వత్సవాయి/ఎన్టీఆర్ జిల్లా, జులై 12 (ఆంధ్రజ్యోతి): బీసీ విద్యార్థుల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని ఏపీ మంత్రి సవిత (AP Minister Savitha) వ్యాఖ్యానించారు. సన్నబియ్యంతో రుచికరమైన భోజనం అందిస్తున్నామని పేర్కొన్నారు. డైట్ ఛార్జీల బిల్లులు 10 శాతం పెంచబోతున్నామని తెలిపారు. బీసీ బిడ్డలకు రుచికరమైన, కడుపు నిండేలా భోజనం అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. బీసీ విద్యార్థులు అత్యున్నత స్థానాల్లో నిలవాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని ఉద్ఘాటించారు. ఈరోజు (ఆదివారం) వత్సవాయి మండల కేంద్రంలో మంత్రి సవిత పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వత్సవాయి ఎంజేపీ గురుకుల పాఠశాలలో పీ-4 విధానంలో రూ.75 లక్షలతో నిర్మించిన డైనింగ్ హాల్, డార్మెటరీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజగోపాల్, మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడారు.


సీఎం చంద్రబాబు పీ 4 విధానం తెచ్చారు..

సీఎం చంద్రబాబు ఆశయాన్ని కొనసాగిస్తూ... పీ 4 విధానంలో వత్సవాయి ఎంజేపీ స్కూల్‌ను అభివృద్ధి చేసిన ఎన్ఆర్ఐ చిరుమామిళ్ల రాంబాబు దంపతులను అభినందించారు. చిరుమామిళ్ల రాంబాబు ఎంతో మంది దాతలకు స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు. బీసీ గురుకులాలను స్థాపించిన ఘనత దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావుది అని తెలిపారు. సీఎం చంద్రబాబు వందలాది బీసీ గురుకులాలను ఏర్పాటు చేశారని ప్రస్తావించారు. సమాజం నుంచి పేదరికాన్ని పారదోలాలని సీఎం చంద్రబాబు పీ 4 విధానం తీసుకువచ్చారని పేర్కొన్నారు. మన చుట్టు పక్కల ఉన్న పేదల కోసం ధనవంతులు ఎంతో కొంత సాయం చేయాలనే సదుద్దేశంతో పీ 4 విధానాన్ని సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని ప్రస్తావించారు. కార్పొరేట్ విద్యాసంస్థల కంటే ఎంజేపీ సీట్లకే డిమాండ్ ఎక్కువగా ఉందని వెల్లడించారు.


ఎంజేపీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు..

పదోతరగతి, ఇంటర్‌లో ఎంజేపీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని మంత్రి సవిత ప్రశంసించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఫొటోతో కూడిన విద్యామిత్ర కిట్లను అందజేస్తున్నామని తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీసుకొస్తున్న సంస్కరణల ఫలితంగా పదోతరగతి, ఇంటర్‌లో గతంలో ఎన్నడూలేనివిధంగా ఈ ఏడాది ఫలితాలు వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం ఏపీలో 109 గురుకులాలు ఉండగా, ఈ ఏడాది కొత్తగా మరో 10 గురుకులాలను ప్రారంభించామని చెప్పుకొచ్చారు. 6 ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేశామని వెల్లడించారు. రూ.500 కోట్ల సాస్కీ నిధులతో ఎంజేపీ గురుకులాలకు శాశ్వత భవనాలు ఏర్పాటు చేశామని అన్నారు. కొత్తగా బీసీ హాస్టళ్లకు బదులు గురుకులాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఎంజేపీ స్కూళ్లు, బీసీ హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ఆర్వో పాంట్లు, సీసీటీవీ కెమెరాలు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేశామని మంత్రి సవిత పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

జనాభా నియంత్రణ కాదు.. జనాభా సంరక్షణే లక్ష్యం: సీఎం చంద్రబాబు

యువత పరిశోధనలు, ఆవిష్కరణలు స్టార్టప్‌ల వైపు అడుగులు వేయాలి: గవర్నర్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 12 , 2026 | 03:17 PM