శ్రీవారి ఫొటోలతో ర్యాలీ చేయడం అమానుషం.. జగన్ అండ్ కోపై ఫరూక్ షుబ్లీ ధ్వజం..
ABN , Publish Date - Feb 20 , 2026 | 06:45 PM
హిందువుల కలియుగ దైవమైన వేంకటేశ్వరస్వామి ఫొటోలు పట్టుకొని వైసీపీ ఎమ్మెల్సీలు ర్యాలీ చేయడం హేయమైన చర్య అని ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షుబ్లీ పేర్కొన్నారు. కాలికి బూట్లు, చెప్పులు వేసుకొని శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు.. వేంకటేశ్వరస్వామి ఫొటోలు పట్టుకోవడం అమానుషమని అన్నారు..
విజయవాడ, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): హిందువుల కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి ఫొటోలు పట్టుకొని వైసీపీ ఎమ్మెల్సీలు ర్యాలీ చేయడం హేయమైన చర్య అని ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షుబ్లీ (Farooq Shubli) పేర్కొన్నారు. శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు.. కాలికి బూట్లు, చెప్పులు వేసుకొని.. వేంకటేశ్వరస్వామి ఫొటోలు పట్టుకోవడం అమానుషమని అన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు హిందువులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దేవుళ్లను, మతాలను రాజకీయంగా వాడుకోవడం వైసీపీ నేతలకే చెల్లుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అబద్దాల మ్యానిఫెస్టోని దివ్యగ్రంథాలతో పోల్చిన పార్టీ వైసీపీ అని ఫరూక్ షుబ్లీ దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం అన్నివర్గాలనూ సమన్యాయంగా చూస్తోందని స్పష్టం చేశారు. కోవా బన్ అంశంలో కూటమి ప్రభుత్వం బాసటగా నిలబడిందని నొక్కిచెప్పారు. మైనార్టీలంటే వైసీపీ పార్టీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. జగన్ హయాంలో 200కు పైగా దేవాలయాలపై దాడులు జరిగాయని ప్రస్తావించారు. వైసీపీ హయంలో వక్ఫ్ బోర్డు భూముల కబ్జాకు ప్రయత్నం చేశారని మండిపడ్డారు.
జగన్ హయాంలో వేధింపులు తట్టుకోలేక అబ్దుల్ సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడిందని ఫరూక్ షుబ్లీ గుర్తుచేశారు. టీటీడీ లడ్డూ ప్రసాదం ఎంతో ప్రీతిపాత్రమైనదని.. అలాంటి లడ్డూను కూడా జగన్ ప్రభుత్వం కల్తీ చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం మతసామర్యసాన్ని పెంపొందిస్తోందని.. ఈరోజు హిందువులకు జరిగిందని, రేపు ఇతర మతాలకు జరగదని గ్యారెంటీ ఏముందని ప్రశ్నించారు. పరస్పర మత గౌరవం అందరికీ ఉండాలని ఫరూక్ షుబ్లీ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైరిటేజ్.. నాణ్యతలో రాజీ పడబోం: నారా భువనేశ్వరి
యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యం: మంత్రి నారా లోకేశ్
Read Latest Telangana News And AP News And Telugu News