మమ్మల్ని అవమానించొద్దు.. వైసీపీ నేతలపై 2025 డీఎస్సీ ఉపాధ్యాయుల ధ్వజం
ABN , Publish Date - Aug 16 , 2026 | 11:50 AM
2025 డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు బందరు రోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దగ్గర ఆదివారం ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భారీగా ఉపాధ్యాయులు పాలుపంచుకున్నారు.
విజయవాడ, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): 2025 డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు బందరు రోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దగ్గర ఈరోజు (ఆదివారం) ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. ఇందిరా గాంధీ స్టేడియం నుంచి స్వరాజ్ మైదాన్‌లోని అంబేడ్కర్ విగ్రహం వరకూ టీచర్లు ఈ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో భారీగా ఉపాధ్యాయులు పాలుపంచుకున్నారు. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఉపాధ్యాయులు భారీగా తరలివచ్చి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. వైసీపీ నేతల దుష్ప్రచారానికి వ్యతిరేకంగా డీఎస్సీ 2025 టీచర్లు ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ నేతలు తమను అవమానిస్తున్నారంటూ ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జగన్ అండ్ కో తమను అవమానించవద్దంటూ ఉపాధ్యాయులు కోరుతున్నారు. తండ్రి చనిపోతే ఆ సానుభూతితో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం కాగలిగారని, ఆయనది కారుణ్య నియామకం కాదా..? అని టీచర్లు ప్రశ్నించారు. తమవి కారుణ్య నియామకాలు కాదని, తాము కష్టపడి చదువుకుని డీఎస్సీ పరీక్ష రాసి ఉద్యోగం సంపాదించామని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
‘మాది మెగా డీఎస్సీ - దగా ఎస్సీ’ కాదని ఉపాధ్యాయులు స్పష్టం చేశారు. వైసీపీ నేతలు తమపై నిందలు వేయడం మానుకోవాలని.. నిజం తెలుసుకోవాలటూ టీచర్లు నినాదాలు చేశారు. పాఠాలతో పాటు గుణపాఠాలు కూడా చెబుతామంటూ ఉపాధ్యాయులు నినాదించారు. 2025 డీఎస్సీ ప్రతిభగల డీఎస్సీ అని టీచర్లు వ్యాఖ్యానించారు. జగన్ అండ్ కో తమపై బురద జల్లటం మానుకుని.. బుద్ధి తెచ్చుకోవాలని ప్లకార్డులు పట్టుకుని టీచర్లు ఈ ర్యాలీ చేపట్టారు. తమతో పెట్టుకోవద్దని ఉపాధ్యాయులు హెచ్చరించారు.
వార్తలు కూడా చదవండి...
దమ్ముంటే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలి: యరపతినేని
‘నిబంధనల ప్రకారమే జగన్‌ను ములాఖత్‌కు అనుమతించాం’
తిరుపతిలో ఆస్తి రిజిస్ట్రేషన్ వివాదం.. రైతు ఆత్మహత్యాయత్నం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News