Share News

గుర్రం జాషువా తన కవితలతో ప్రజల్లో చైతన్యం తెచ్చారు:మంత్రి దుర్గేశ్

ABN , Publish Date - Sep 28 , 2026 | 12:08 PM

కవి గుర్రం జాషువా ఆశయ సాధనకు కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి కందుల దుర్గేశ్ వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల నేతృత్వంలో కళలకు, కళాకారులకు పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు.

గుర్రం జాషువా తన కవితలతో ప్రజల్లో చైతన్యం తెచ్చారు:మంత్రి దుర్గేశ్
AP Minister Kandula Durgesh

విజయవాడ, సెప్టెంబర్ 28 (ఆంధ్రజ్యోతి): కవి గుర్రం జాషువా ఆశయ సాధనకు కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి కందుల దుర్గేశ్ (AP Minister Kandula Durgesh) వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల నేతృత్వంలో కళలకు, కళాకారులకు పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు. ఈరోజు (సోమవారం) రాష్ట్ర సృజనాత్మక, సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య కళా వేదికలో ఘనంగా పద్మభూషణ్, కవిసామ్రాట్ గుర్రం జాషువా 131వ జయంతి వేడుకలు నిర్వహించారు.


సాహితీవేత్తలు షేక్ కరీముల్లా, డాక్టర్ జాలాది విజయకుమారి, విల్సన్ రావు కొమ్మ వరపు, గడ్డం ఈశ్వరమ్మలకు నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా సాహితీ పురస్కారాలను ప్రదానం చేశారు. జాషువా చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేశ్ మాట్లాడారు. తన కవితలతో ప్రజల్లో కవి గుర్రం జాషువా చైతన్యం తీసుకువచ్చారని తెలిపారు. తమ రచనలతో సామాజిక చైతన్యానికి కృషి చేసిన ఎందరో మహానుభావుల జయంతి వేడుకలను రాష్ట్ర పండుగగా ప్రకటించి ఘనంగా నిర్వహిస్తున్నాయని వెల్లడించారు. గుర్రం జాషువా గురించి భవిష్యత్తు తరాలకు వివరిస్తున్నామని మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. పదోన్నతులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

విశాఖలో మీడియా సమావేశం పెడతా.. ఆ విషయాలపై మాట్లాడతా: విజయసాయి రెడ్డి

శవ రాజకీయాలు చేసే స్థాయికి వైసీపీ నేతలు దిగజారారు: మంత్రి నిమ్మల

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 28 , 2026 | 12:39 PM