Share News

పది నెలల బాలుడి కిడ్నాప్ కేసు.. ముగ్గురి నిందితుల అరెస్ట్

ABN , Publish Date - Apr 18 , 2026 | 09:32 PM

పది నెలల బాలుడు కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు. పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పదినెలల బాలుడిని కిడ్నాప్ చేసి విక్రయించిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు.

పది నెలల బాలుడి కిడ్నాప్ కేసు.. ముగ్గురి నిందితుల అరెస్ట్
Kidnapping Case

కృష్ణాజిల్లా, మచిలీపట్నం, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): పది నెలల బాలుడు కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు. పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పదినెలల బాలుడిని కిడ్నాప్ చేసి విక్రయించిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ కేసు పూర్వాపరాలను ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మీడియా సమావేశంలో వివరించారు. వీరిలో మంగళగిరికి చెందిన మాదాసు సూమమ్మ పడమట ఆటోనగర్‌లో భిక్షాటన చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆమె పదినెలల కుమారుడిని కిడ్నాప్ చేశారని వెల్లడించారు.


ఆటోడ్రైవర్‌తోపాటు మచిలీపట్నంలో కొనుగోలు చేసిన దంపతులను అరెస్ట్ చేశామని చెప్పుకొచ్చారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉందని తెలిపారు. మిగిలిన నిందితులను కూడా త్వరలోనే అరెస్ట్ చేసి కేసును పూర్తిస్థాయిలో ఛేదిస్తామని అన్నారు. బాలుడిని గుర్తించడంలో ప్రత్యేక పనితీరు కనపరిచిన పోలీసులకు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు రివార్డులు అందజేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

చెవిరెడ్డి కుటుంబ అవినీతి మెుత్తాన్నీ త్వరలో బయటపెడతాం.. పులివర్తి నాని వార్నింగ్

ఎల్‌ఓసీ రద్దు పిటిషన్‌పై సజ్జల భార్గవ్ రెడ్డికి హైకోర్టు షాక్

నారీ శక్తి వందన్ బిల్లుపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి.. మంత్రి సత్యకుమార్ ధ్వజం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Apr 18 , 2026 | 09:36 PM