Share News

గొర్రెలకు మేతగా టమోటా పంట

ABN , Publish Date - Mar 10 , 2026 | 11:25 AM

టమోటా రైతుల కష్టం పశువులు, గొర్రెలకు మేతగా మారింది. కోటి ఆశలతో సాగు చేసిన టమోటా పంట అన్నదాతకు అప్పులే మిగిల్చింది.

గొర్రెలకు మేతగా టమోటా పంట

  • తోటల్లో వదిలేసిన కాయలు

  • అప్పుల ఊబిలో అన్నదాత

టమోటా రైతుల కష్టం పశువులు, గొర్రెలకు మేతగా మారింది. కోటి ఆశలతో సాగు చేసిన టమోటా పంట అన్నదాతకు అప్పులే మిగిల్చింది. ధరలు లేకపోవడంతో కాయలను కోయకుండానే వదిలేశారు. ఇంకొందరు రైతులు గొర్రెలు, పశువులకు మేతగా ఇచ్చారు. లక్షలాది రూపాయలు వెచ్చించి పంట సాగు చేసిన రైతులు ధరాఘాతంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.

గుర్రంకొండ(అన్నమయ్య): పడమటి మండలాల్లో అన్నదాతలు టమోటా పంట సాగుపై మక్కువ చూపుతారు. ఈ క్రమంలో టమోటా పంటను వేలాది ఎకరాల్లో సాగు చేశారు. ప్రస్తుతం పంట దిగుబడి అధికంగా ఉంది. బయట రాష్ట్రాల్లో కూడా టమోటా దిగుబడి అధికంగా ఉండడంతో ఆ వ్యాపారులు ఇటు రావడం లేదు. ఈ నేపథ్యంలో మార్కెట్‌ యార్డుకు వచ్చే టమోటాలను కొనుగోలు చేయడానికి వ్యాపారులు ముందుకు రాకపోడంతో ధరలు పతనం కావడానికి మరో కారణంగా తెలుస్తోంది.


pandu2.2.jpgప్రస్తుతం మార్కెట్‌లో కిలో టమోటా ధర రూ.4 నుంచి రూ.8 వరకు ఉంది. ఈ లెక్క 25 కిలోల టమోటా క్రేట్‌ ధర రూ.100 నుంచి 200ల గరిష్ట ధర పలుకుతోంది. టమోటా ధరలు పతనం కావడంతో అన్నదాతలు తల్లడిల్లిపోతున్నారు. తోటలో కాయలను కోస్తే కూలీల సొమ్ము గిట్టుబాటు కాకపోవడంతో కొంత మంది రైతులు వదిలేస్తే మరికొంత మంది పశువులు, గొర్రెలకు మేతగా వదిలేశారు. ఈ పంటలోనైనా లాభాలు గడించాలని ఆశించిన రైతన్నకు నిరాశే మిగిలింది.


pandu2.jpgఈ వార్తలు కూడా చదవండి:

స్వల్ప తగ్గుదల.. ఈ రోజు వెండి, బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

పోలవరం జిల్లాలో పులి సంచారం.. అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ హెచ్చరిక

Read Latest Telangana News and National News

Updated Date - Mar 10 , 2026 | 11:25 AM