Share News

పోలవరం జిల్లాలో పులి సంచారం.. అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ హెచ్చరిక

ABN , Publish Date - Mar 10 , 2026 | 09:10 AM

పోలవరం జిల్లాలో పులి సంచారం స్థానికుల్లో భయాందోళన కలిగిస్తోంది. రాజవొమ్మంగి రేంజ్ పరిధిలోని బోర్ణగూడెం అటవీ ప్రాంతంలో పులి తిరుగుతున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు.

పోలవరం జిల్లాలో పులి సంచారం.. అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ హెచ్చరిక
Tiger Movement Polavaram District

పోలవరం: జిల్లాలో పులి సంచారం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. రాజవొమ్మంగి రేంజ్ పరిధిలోని బోర్ణగూడెం అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులి సంచరిస్తున్న దృశ్యాలను అధికారులు విడుదల చేశారు.


అటవీశాఖ అధికారుల సమాచారం ప్రకారం, సాటిలైట్ కాలర్ ఆధారంగా పులి కదలికలను నిరంతరం గమనిస్తున్నారు. ఇటీవల జనావాసాలకు సమీపంగా సంచరిస్తూ పశువులపై దాడులు చేయడంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆవులను చంపిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు.


ఈ నేపథ్యంలో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, అటవీ ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. పులిని సురక్షితంగా బంధించేందుకు ప్రత్యేక బృందాలతో రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రారంభించారు. పులిని పట్టుకుని అడవిలో సురక్షిత ప్రాంతానికి తరలించేలా చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. ప్రజలు భయపడకుండా అధికారులతో సహకరించాలని కోరుతున్నారు.


Also Read:

పెరిగిన పచ్చిమిర్చి.. తగ్గిన టమోటా

పేదల ఇళ్లు కూల్చడం ప్రభుత్వ ఉద్దేశం కాదు

For More Latest News

Updated Date - Mar 10 , 2026 | 09:13 AM