గండిపేట గోల్కొండ రిసార్ట్స్‌లో బీఆర్ఎస్ వర్క్‌షాప్
ABN , Publish Date - Mar 10 , 2026 | 08:45 AM
హైదరాబాద్‌లోని గండిపేట వద్ద గోల్కొండ రిసార్ట్స్‌లో బీఆర్ఎస్ వర్క్‌షాప్ నిర్వహించనుంది. అసెంబ్లీ వ్యవహారాలు, వ్యూహాలు, ప్రజా సమస్యలను సభలో ఎలా లేవనెత్తాలనే అంశాలపై కేటీఆర్, హరీశ్ రావు ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు.
హైదరాబాద్: గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ లో నేడు బీఆర్ఎస్ వర్క్‌షాప్ నిర్వహించనుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్ రావు.. పార్టీ ప్రజాప్రతినిధులకు అసెంబ్లీ వ్యవహారాలు, వ్యూహాలపై అవగాహన కల్పించేందుకు ఈ వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. సభలో ప్రజాప్రతినిధులు ఎలా వ్యవహరించాలి, ప్రజల సమస్యలను ఏ విధంగా లేవనెత్తాలి అనే అంశాలపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు.
అసెంబ్లీలో అనుసరించాల్సిన నియమనిబంధనలు (రూల్ బుక్), రాజ్యాంగ సంబంధిత అంశాలు, చర్చల సమయంలో పాటించాల్సిన విధానాలపై కూడా వివరణ ఇవ్వనున్నారు. ప్రజా సమస్యలను సమర్థంగా సభలో ప్రస్తావించేందుకు అవసరమైన వ్యూహాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. వర్క్‌షాప్‌ను కేటీఆర్ ప్రారంభించనుండగా, ముగింపు సమావేశంలో హరీశ్ రావు కీలక సూచనలు చేయనున్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాలను దృష్టిలో పెట్టుకుని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది. కాగా, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 16 నుంచి 30 వరకు జరగనున్నాయి.
Also Read:
పెరిగిన పచ్చిమిర్చి.. తగ్గిన టమోటా
పేదల ఇళ్లు కూల్చడం ప్రభుత్వ ఉద్దేశం కాదు
For More Latest News