ఏసీ బస్సుల్లో 20-30 శాతం రాయితీ
ABN , Publish Date - Mar 10 , 2026 | 10:12 AM
వేసవికాలం గ్రేటర్ ప్రయాణికులకు 20-30 శాతం రాయుతీతో ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు సేవలు అందించనుంది. ఈ మేరకు గ్రేటర్ ఆర్టీసీ చర్యలు చేపట్టింది.
మూడు నెలల పాటు వర్తింపు
ఆక్యుపెన్సీ పెంచేదిశగా గ్రేటర్ ఆర్టీసీ చర్యలు
హైదరాబాద్ సిటీ: వేసవికాలం గ్రేటర్ ప్రయాణికులకు 20-30 శాతం రాయుతీతో ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు సేవలు అందించనుంది. ఈ మేరకు గ్రేటర్ ఆర్టీసీ చర్యలు చేపట్టింది. మార్చి, ఏప్రిల్, మే మూడు నెలలు టికెట్ చార్జీలపై రాయితీని అందిస్తూ ప్రయాణికుల ఆక్యుపెన్సీ పెంచేదిశగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సాధారణంగా 60శాతం నమోదయ్యే ప్రయాణికుల ఆక్యుపెన్సీని వేసవిలో 90-100 శాతం పెంచాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది.
ఎయిర్‌పోర్టు(Airport) రూట్‌లో ఆర్టీసీ నడుపుతున్న 50 పుష్పక్ బస్సులు, నగర పరిధిలో 40 ఏసీ బస్సుల్లో రాయితీని వర్తింపజేస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఏడాది చివరినాటికి గ్రేటర్‌జోన్‌కు కొత్తగా మరో 170 ఈవీ బస్సులు తీసుకువచ్చే దిశగా ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
స్వల్ప తగ్గుదల.. ఈ రోజు వెండి, బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
వెంకటేశ్‌నాయుడు విచారణకు అనుమతివ్వండి
Read Latest Telangana News and National News