పుతిన్‌కు ట్రంప్ ఫోన్ కాల్.. ఇరాన్ యుద్ధం గురించి చర్చ..
ABN , Publish Date - Mar 10 , 2026 | 11:10 AM
అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు. ఇరాన్ యుద్ధం, చమురు సరఫరాలో అంతరాయం, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మొదలైన విషయాలపై ఇరువురు నేతల మధ్య చర్చలు జరిగాయి.
అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు. ఇరాన్ యుద్ధం, చమురు సరఫరాలో అంతరాయం, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మొదలైన విషయాలపై ఇరువురు నేతల మధ్య చర్చలు జరిగినట్టు రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ వెల్లడించింది. ఇద్దరి మధ్య దాదాపు గంట పాటు చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్, రష్యా, అమెరికా త్రిముఖ చర్చల గురించి కూడా ఈ సంభాషణలో ప్రస్తావన వచ్చినట్టు సమాచారం (Trump Putin call).
యుద్ధం కారణంగా తమ మిత్ర దేశమైన ఇరాన్ భారీగా నష్టపోతున్నట్టు పుతిన్ ఆందోళన వ్యక్తం చేశారని క్రెమ్లిన్ వెల్లడించింది. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధాన్ని త్వరగా ముగించేందుకు చర్యలు తీసుకోవాలని ట్రంప్‌నకు పుతిన్ సూచించారని తెలిపింది. యుద్ధం ముగింపునకు తీసుకోవాల్సిన దౌత్య చర్యలపై కొన్ని ప్రతిపాదనలను ట్రంప్‌నకు పుతిన్ సూచించినట్టు రష్యా విదేశాంగ సలహాదారు యూరి ఉషాకోవ్ తెలిపారు (Trump Putin phone conversation).
ఉక్రెయిన్-రష్యా యుద్ధం గురించి కూడా ట్రంప్, పుతిన్ మాట్లాడుకున్నట్టు యూరి ఉషాకోవ్ తెలిపారు (Ukraine war updates). ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపుపై అమెరికా ప్రతినిధులతో జరుగుతున్న ద్వైపాక్షిక చర్చల గురించి కూడా ట్రంప్, పుతిన్ మాట్లాడుకున్నారని పేర్కొన్నారు. కాగా, ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌తో పుతిన్ మాట్లాడారని, టెహ్రాన్‌కు రష్యా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారని ఉషాకోవ్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ యుద్ధం.. పెట్రోల్, గ్యాస్, ఎరువుల నిల్వలు సరిపోతాయా..
స్వల్ప తగ్గుదల.. ఈ రోజు వెండి, బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..