Share News

పులివెందులలో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన 20 కుటుంబాలు

ABN , Publish Date - Oct 28 , 2026 | 03:27 PM

పులివెందులలో వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో 20 కుటుంబాలు చేరాయి. పసుపు కండువా కప్పి పార్టీలోకి పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్ బీటెక్ రవి బుధవారం ఆహ్వానించారు.

పులివెందులలో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన 20 కుటుంబాలు
Pulivendula TDP

కడప జిల్లా, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): పులివెందులలో వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో 20 కుటుంబాలు చేరాయి. పసుపు కండువా కప్పి పార్టీలోకి పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్ బీటెక్ రవి ఈరోజు (బుధవారం) సాదరంగా వారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా రవి మీడియాతో మాట్లాడారు. టీడీపీ విధివిధానాలు నచ్చి యువత ఎక్కువ శాతం తమ పార్టీలో చేరుతున్నారని తెలిపారు.


పులివెందులలో టీడీపీ వైపు ప్రజలు ఎక్కువ శాతం మొగ్గుచూపుతున్నారని బీటెక్ రవి తెలిపారు. నాలుగు రోజుల్లో ఎన్నికలు ఉన్నప్పటికీ ప్రతి వార్డులో తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులు అవుతున్నారని చెప్పారు. మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి గీతా కుమారిని అత్యధిక మెజారిటీతో గెలిపించబోతున్నామని బీటెక్ రవి ధీమా వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆర్నబ్ తుఫాన్ పునరావాస శిబిరాల్లో ఆహారం, తాగునీరు సిద్ధం చేయండి: సీఎం చంద్రబాబు

స్థానిక ఎన్నికల్లో కూటమి ధర్మం పాటించాల్సిందే.. శ్రేణులకు చంద్రబాబు, పవన్, మాధవ్ దిశానిర్దేశం

ఆర్న‌బ్ తుఫాన్‌ ప్రభావం.. ఏపీ ప్రభుత్వం స‌ర్వ‌త్రా అప్ర‌మ‌త్తం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 28 , 2026 | 03:46 PM