డీఎస్సీపై మరో కుట్రకు తెరలేపిన వైసీపీ
ABN , Publish Date - Jun 14 , 2026 | 07:12 PM
డీఎస్సీపై మరో కుట్రకు వైసీపీ తెరలేపింది. తన అనుకూల సోషల్ మీడియా, తన అనుకూల వ్యక్తుల ద్వారా కమ్మ కులానికి టీచర్ పోస్టులంటూ తప్పుడు విశ్లేషణలని జగన్ బ్యాచ్ చేయిస్తోంది. 2014-19 మధ్య కాలంలో కమ్మ కులానికి చెందిన డీఎస్పీలకే ప్రమోషన్లు అంటూ నాడు తప్పుడు ప్రచారం చేసింది.
అమరావతి, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): డీఎస్సీపై మరో కుట్రకు వైసీపీ తెరలేపింది. తన అనుకూల సోషల్ మీడియా, తన అనుకూల వ్యక్తుల ద్వారా కమ్మ కులానికి టీచర్ పోస్టులంటూ తప్పుడు విశ్లేషణలని జగన్ బ్యాచ్ చేయిస్తోంది. 2014-19 మధ్య కాలంలో కమ్మ కులానికి చెందిన డీఎస్పీలకే ప్రమోషన్లు అంటూ నాడు తప్పుడు ప్రచారం చేసింది. ఇప్పుడు డీఎస్సీ-2025 విషయంలో మళ్లీ పాత స్ట్రాటజీనే తెర మీదకు తెస్తూ వైసీపీ విషం చిమ్ముతోంది. డీఎస్సీపై వైసీపీ ఆరోపణలకు గట్టిగా కౌంటర్లు ఇస్తోండటంతో దుష్ప్రచారానికి ఎప్పటికప్పుడూ కొత్తదారులు వెతుక్కుంటోంది వైసీపీ. డీఎస్సీ-2025 నిర్వహణను అడ్డుకునేలా 241 కేసులు, ఆ తర్వాత పేపర్ లీక్ పేరుతో డ్రామాలు, ఫిజికల్ వెరిఫికేషన్‌కు పిలిచి ఉద్యోగాలు ఇవ్వలేదని - హారిజాంటల్ రిజర్వేషన్ల అంటూ మోసం చేశారంటూ కొత్త ఆరోపణలు చేసింది.
ప్రతి దానికీ కేస్ బై కేస్ వివరణలు, క్లారిటీ ఇవ్వడంతో దిక్కుతోచక స్పోర్ట్స్ కోటాపై ఆరోపణలకి జగన్ బ్యాచ్ దిగింది. స్పోర్ట్స్ కోటాలోనూ ఎలాంటి అవతవకల్లేవని.. కావాలంటే నిరూపించుకోవాలని అధికారుల ఛాలెంజ్ చేసిన విషయం తెలిసిందే. డీఎస్సీ నిర్వహణపై వైసీపీ చేస్తున్న ఆరోపణలకు చర్చకు సిద్ధమంటూ తిరుపతి ప్రెస్‌క్లబ్‌కు వెళ్లి వైసీపీ నేతల కోసం టీడీపీ ఎమ్మెల్సీలు వెయిట్ చేశారు. అయితే వైసీపీ నేతలు అక్కడకు రాకుండా తోక ముడిచారు. ప్రతి అంశంపైనా క్లియర్ కట్ కౌంటర్లు ఇస్తోండటంతో డీఎస్సీ స్పోర్ట్స్ కోటా రిక్రూట్‌మెంట్‌లో కమ్మ కులానికి చెందిన వారికే టీచర్ పోస్టులు ఇచ్చారంటూ సరికొత్త దుష్ప్రచారానికి వైసీపీ తెర లేపింది.
స్పోర్ట్స్ కోటాలో మొత్తంగా 382 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తే... ఓసీలకు కేవలం 42 టీచర్ పోస్టులు కేటాయించారని అధికారులు క్లారిటీ ఇచ్చారు. అందులో కమ్మ కులానికి కేవలం 9 టీచర్ పోస్టులు మాత్రమే ఇచ్చారని స్పష్టం చేశారు. ఓసీల్లో అందరికంటే ఎక్కువగా 16 మంది కాపులకు, 10 రెడ్లకు, 9 కమ్మ సామాజికవర్గానికి చెందిన వారికి టీచర్ పోస్టులు ఇచ్చారని అధికారులు తేల్చిచెప్పారు. వైశ్య, క్షత్రియ, బ్రహ్మణులకు చెరో 2 టీచర్ పోస్టులు, మైనార్టీలకు 1 టీచర్ పోస్టు కేటాయించినట్లు లెక్కలతో సహా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకానికి సంబంధించి కులాల వారీగా లెక్కలు పక్కాగా ఇవ్వడంతో తమకు ఎలాంటి ఉద్దేశ్యాలు లేవని.. కుట్రలకు పాల్పడటం లేదంటూ వైసీపీ అనుకూల మీడియా మాట మార్చింది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీ అభివృద్ధిని గొడ్డలి పార్టీ అడ్డుకుంటోంది.. కొల్లు రవీంద్ర ధ్వజం
ఎంఎస్ఎంఈ పార్కులతో యువతకు భారీ ఉద్యోగ అవకాశాలు: మంత్రి భరత్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News