ఏపీలో కేంద్రమంత్రి నడ్డా పర్యటన.. 22 వైద్య ప్రాజెక్టులు ప్రారంభం
ABN , Publish Date - Sep 11 , 2026 | 09:54 PM
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఏపీలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు నడ్డా పర్యటన షెడ్యూల్ ఖరారైంది
అమరావతి, సెప్టెంబర్ 11 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా (Union Minister JP Nadda) రేపు (శనివారం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఏపీలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు నడ్డా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రేపు విజయవాడలో 10 క్రిటికల్ కేర్ బ్లాకులు, 12 ఐపీహెచ్ ల్యాబ్‌లను ప్రారంభించనున్నారు. జేపీ నడ్డాతో కలిసి ప్రారంభోత్సవంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 22 వైద్య ప్రాజెక్టులను జేపీ నడ్డా ప్రారంభించనున్నారు. రూ.249 కోట్లతో నిర్మించిన వైద్య మౌలిక వసతులు అందుబాటులోకి రానున్నాయి. కొత్తగా 500 క్రిటికల్ కేర్ బెడ్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. అత్యాధునిక ఓటీలు, అల్ట్రాసౌండ్ సేవలను సీసీబీల్లో ఏర్పాటు చేయనున్నారు. కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అత్యవసర వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గనుంది. కేంద్రం మంజూరు చేసిన 26 ఐపీహెచ్ ల్యాబ్‌ల్లో మిగిలిన 12 ల్యాబ్‌లను ప్రారంభించనున్నారు.
జిల్లా స్థాయిలోనే కీలక వైద్య పరీక్షలకు ఐపీహెచ్ ల్యాబ్‌లు ఉపయోగపడనున్నాయి. మైక్రోబయాలజీ, హీమటాలజీ పరీక్షలు జిల్లా కేంద్రాల్లోనే ఆయా వ్యాధులను ముందుగానే గుర్తించేందుకు ఐపీహెచ్ ల్యాబ్‌లు దోహదం చేయనున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు పాత జీజీహెచ్‌లో ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. అంబేడ్కర్ కళావేదికలో రాష్ట్రవ్యాప్త ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం 1:25గంటల వరకు జేపీ నడ్డాతో కలిసి ఆయా కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కలెక్టర్ల సదస్సు.. 19 అంశాలపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్
జగన్‌కు దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి: అయ్యన్నపాత్రుడు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గోదావరి పుష్కరాలకు నిధుల మంజూరు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News