Share News

తుఫాన్ సహాయక చర్యల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా చర్యలు చేపట్టాలి: పవన్ కల్యాణ్

ABN , Publish Date - Oct 27 , 2026 | 06:16 PM

ఆర్నబ్ తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. తుఫాన్ సన్నద్ధతపై కాకినాడ జిల్లా కలెక్టర్, అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

తుఫాన్ సహాయక చర్యల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా చర్యలు చేపట్టాలి: పవన్ కల్యాణ్
AP Deputy CM Pawan Kalyan

అమరావతి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ఆర్నబ్ తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) దిశానిర్దేశం చేశారు. తుఫాన్ సన్నద్ధతపై కాకినాడ జిల్లా కలెక్టర్, అధికారులతో ఈరోజు (మంగళవారం) రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై మార్గనిర్దేశం చేశారు. ఆర్నబ్ విపత్తును సమర్థంగా ఎదుర్కోవాలని సూచించారు. ప్రాణ నష్టం జరగకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇవాళ సాయంత్రంలోపు తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని దిశానిర్దేశం చేశారు.


తుఫాన్ ప్రభావిత ఆవాసాలపై ప్రత్యేక దృష్టి సారించాలి..

92 తుఫాన్ ప్రభావిత ఆవాసాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పవన్ కల్యాణ్ సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలకు లోటు లేకుండా చూడాలని మార్గనిర్దేశం చేశారు. ఏలేరు వరద ప్రవాహంపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విద్యుత్, రహదారులు, తాగునీటి సరఫరా పునరుద్ధరణకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని సూచించారు. సహాయక చర్యల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అర్నబ్ తుఫాన్ గమనంపై నిరంతర నిఘా.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

అర్నబ్ తుఫాన్.. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోండి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

ఏపీకి కేంద్రం భారీ సాయం.. రూ.27, 370 కోట్ల గ్రీన్‌ఎనర్జీ ప్రాజెక్టుకు ఆమోదం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 27 , 2026 | 07:07 PM