Share News

రాయలసీమ అభివృద్ధిపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్

ABN , Publish Date - Aug 30 , 2026 | 03:23 PM

రాయలసీమ అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. రాయలసీమలో పల్లె సీమల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు.

రాయలసీమ అభివృద్ధిపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్
AP Deputy CM Pawan Kalyan

అమరావతి, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) స్పెషల్ ఫోకస్ పెట్టారు. రాయలసీమలో పల్లె సీమల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. రూ. 8,022 కోట్లతో గ్రామాలు, అటవీ అభివృద్ధి కోసం ప్రత్యేక విజన్‌‌ను రూపొందించారు. రూ. 4,523 కోట్లతో 23,000కు పైగా రోడ్ల పనులు జరగనున్నాయి. ఇప్పటికే 5,238 కిలోమీటర్ల మేర బీటీ, సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేసిన విషయం తెలిసిందే.


పవన్ కల్యాణ్ చేపట్టిన జల సంరక్షణ చర్యలతో రాయలసీమ సస్యశ్యామలం కానుంది. ఉపాధి హామీ ద్వారా 62 వేల ఎకరాల్లో ఉద్యాన సాగు చేపట్టారు. దీని ద్వారా 28 వేల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. నీటి కుంటలు, ఇంకుడు గుంతలతో భూగర్భ జలాల వృద్ధి చెందనున్నాయి. 50 వేలకు పైగా ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెరిగింది. పాడి రైతులకు అండగా గోకులాలు, నీటి తొట్టెలను నిర్మించారు. సీమ దాహార్తి తీర్చేందుకు జేజేఎం-అమరజీవి జలధారాలు సిద్ధమవుతున్నాయి. 13 నగర వనాలతో పట్టణాల్లో పచ్చదనం పెంపొందనుంది.


ఇవి కూడా చదవండి..

సంజీవని గేమ్ చేంజర్‌గా మారుతుంది: సీఎం చంద్రబాబు

ఉద్యోగులను రెచ్చగొట్టేలా బొప్పరాజు వ్యవహరిస్తున్నారు: మంత్రి అనగాని

తెలుగు భాషకు గిడుగు రామమూర్తి చేసిన కృషి మరువలేనిది: సీఎం చంద్రబాబు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 30 , 2026 | 03:34 PM